/rtv/media/media_files/2024/12/15/nwyipjGaEKrzsmtyzQlz.jpg)
భారత ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకూ అభివృద్ధి చెందుతోంది. తరచూ కొత్త కొత్త ఫోన్లు మార్కెట్‌లో రిలీజ్ అవుతున్నాయి. ఒకప్పుడు ఎక్కడో ఉన్న భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్.. ఇప్పుడు అగ్రగామిగా నిలిచింది. ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. ప్రతి రోజు ఏదో ఒక స్మార్ట్‌ఫోన్ కంపెనీ భారత మార్కెట్‌లో తమ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి.
ఈ ఏడాది అత్యధికంగా స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్‌లో రిలీజ్ అయ్యాయి. అందులో యాపిల్, శాంసంగ్, వివో, వన్‌ప్లస్, గూగుల్, షావోమి సహా మరెన్నో కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేశాయి. మరి ఈ కంపెనీలు లాంచ్ చేసిన ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: విషాదం.. యువ రైతు ప్రాణం తీసిన అప్పులు
శాంసంగ్ ఎస్ 24 అల్ట్రా ఫ్లాగ్ షిప్ ఫోన్
ఈ ఫోన్ 6.8 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ఎల్‌టిపివో డిస్‌ప్లేతో భారత మార్కెట్‌లో లాంచ్ అయింది. ఇందులో భారీ ప్రాసెసర్ అందించారు. స్నాప్‌డ్రాగన్ 8జెన్ 3 ప్రాసెసర్ అందించారు. అదే సమయంలో 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్లో అందించబడింది.
Also Read: అల్లు అర్జున్‌కు పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే షాక్!
ఇక కెమెరా విషయానికొస్తే.. ఇందులో బ్యాక్ సైడ్ 200 ఎంపీ ఓఐఎస్ కెమెరా అందించారు. దీంతో పాటు 12 ఎంపీ - 50 ఎంపీ - 10 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. అదే సమయంలో ఫోన్ ముందు భాగంలో 12 ఎంపీ సెల్ఫీ కెమెరా అందించబడింది. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో 12/256జీబీ వేరియంట్ ధర రూ.1,29,999, 12/512జీబీ ధర రూ.1,39,999, 12/1టీబీ ధర రూ.1,59,999గా నిర్ణయించబడింది.
వివో ఎక్స్ 200 ప్రో
టెక్ బ్రాండ్ వివో తన లైనప్‌లో ఉన్న ఎక్స్ 200 ప్రో ఫ్లాగ్ షిప్ ఫోన్‌ను ఇటీవల లాంచ్ చేసింది. ఇందులో 6.78 అంగుళాల 2కె 8టీ ఎల్‌టీపీఓ డిస్‌ప్లే అందించారు. అలాగే మీడియా టెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో వచ్చింది. ఇంకా 90వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 30 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. దీని 16/512 జీబీ వేరియంట్ ధర రూ.94,999గా నిర్ణయించబడింది.
Also Read: కల్తీ లడ్డూ వివాదం.. తిరుమలలో సిట్ అధికారులు!
ఐఫోన్ 16 సిరీస్
ఈ ఏడాది ఐఫోన్ 16 సిరీస్ భారత మార్కెట్‌లో లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి మోడళ్లు ఉన్నాయి. ఇందులో రెండు కొత్త బటన్లను అందించారు. వాటిలో అడ్వాన్స్‌డ్ కెమెరా కంట్రోల్ బటన్ ఒకటి కాగా, మరొకటి యాక్షన్ బటన్. ఇది ఐఓఎస్ 18తో పనిచేస్తుంది. దీని బేస్ మోడల్ ధర రూ.79,000గా ఉంది. అలాగే టాప్ మోడల్ ధర రూ.1.44 లక్షలుగా ఉంది.
గూగుల్ పిక్సెల్ 9 సిరీస్
గూగుల్ పిక్సెల్ 9 సిరీస్‌లో కంపెనీ పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ఫోల్డబుల్ మోడళ్లను లాంచ్ చేసింది. వీటి ధరలు కూడా భారీ స్థాయిలో నిర్ణయించబడింది. పిక్సెల్ 9ను రూ.79,999లుగా, పిక్సెల్ 9 ఫోల్డబుల్ ధరను రూ.1,72,999గా కంపెనీ నిర్ణయించింది.
వన్‌ప్లస్ 12
వన్‌ప్లస్ కంపెనీ ఈ ఏడాది వన్‌ప్లస్ 12 ఫ్లాగ్ షిప్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది 6.82 అంగుళాల 2కె ఎల్టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8జెన్ ప్రాసెసర్‌ను అందించారు. కంపెనీ ఈ ఫోన్‌ను రూ.64,999 ధరతో తీసుకొచ్చింది. అలాగే ఇందులో 100 వాట్ సూపర్ వ్యూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 50వాట్ వైర్‌లెస్, 10 వాట్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతునిచ్చే 5,400 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.