Allu Aravind: ED విచారణపై అల్లు అరవింద్ క్లారిటీ.. తప్పు జరిగింది!!

గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌ను ఓ కేసు విషయంలో ఈడీ శుక్రవారం రోజు విచారించింది. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈడీ విచారణకు పిలిచింది వాస్తవమేనని అల్లు అరవింద్ అంగీకరించారు. ఓ ప్రాపర్టీ కేసు విషయమై ఈడీ విచారణ జరిగిందని ఆయన తెలిపారు.

New Update
allu aravind about revanth reddy comments

allu aravind about revanth reddy comments

Allu Aravind: గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌ను ఓ కేసు విషయంలో ఈడీ శుక్రవారం రోజు విచారించింది. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈడీ విచారణకు పిలిచింది వాస్తవమేనని అల్లు అరవింద్ అంగీకరించారు. ఓ ప్రాపర్టీ కేసు విషయమై ఈడీ విచారణ జరిగిందని ఆయన తెలిపారు. 2017లో కొన్న ప్రాపర్టీలో మైనర్ భాగస్వామి వాటా కొనుగోలు చేశానని.. అదే విషయంలో ఈడీ విచారణ జరిపిందని చెప్పారు. 

Also Read: రోటీని నెయ్యితో తినే విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే!

మైనర్ భాగస్వామి వాటాపై ఈడీ వివరాలు అడిగిందని అల్లు అరవింద్ చెప్పారు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో తన పేరు ఉండటంతో ఈడీ విచారణకు పిలిచిందని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. యూనియన్ బ్యాంక్‌కు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ రూ.100 కోట్ల అప్పు ఎగ్గొట్టింది. రామకృష్ణ ఎలాక్ట్రానిక్స్ వాటాను ఆయన కొన్నారట. ఈదే కేసులో అల్లు అరవింద్‌ను ఈడీ విచారణకు పిలిచింది. వచ్చే వారం మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది.

Also Read: కెచప్‌తో రోటీ పరోటా పిల్లలకు ఇస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు