/rtv/media/media_files/2025/08/25/bigboss-19-2025-08-25-12-32-00.jpg)
ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్, మహా కుంభ్‌మేళా(Maha Kumbh Mela) తో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన తాన్యా మిట్టల్(Tanya Mittal) హిందీ బిగ్ బాస్ 19(BIGG BOSS 19) రియాలిటీ షోలోకి అడుగుపెట్టారు. సల్మాన్ ఖాన్(Salman Khan) హోస్ట్ చేస్తున్న ఈ సీజన్‌లో తాన్యా మిట్టల్ మూడో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తాన్యా మిట్టల్ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందినవారు. ఆమె ఒక ఇన్‌ఫ్లూయెన్సర్ కాగా ఇన్‌స్టాగ్రామ్ లో 2.5 మిలయన్ల ఫాలోవర్లు ఉన్నారు. గతంలో మహా కుంభ్‌మేళా సమయంలో జరిగిన తొక్కిసలాటపై ఆమె ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆమె తన అనుభవాలను, ఆ ఘటనలో బాధితులకు ఎలా సహాయం చేశారో వివరించారు. ఈ భావోద్వేగపూరితమైన వీడియో వైరల్ కావడంతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది.
Also Read : Hyderabad: లవర్తో కలిసి మొగుణ్ని లేపేసింది బండరాయితో.. హైదరాబాద్లో మరో దారుణం!
#Tanyamittal ko meine Apni Har Social Media Se Block Kiya hua Hai Ab Ye #bigboss19 me Aa Gayi
— 𝐃𝐢𝐧𝐞𝐬𝐡 ⇾♛ (@Not_A_Runner_) August 24, 2025
Mera Picha kyu nahi chor Rahi ye 😂#BB19#Tanyamittal#GauravKhanna
pic.twitter.com/bLWlZZvtu7
Also Read : ఏఆర్ మురుగదాస్ మరో యాక్షన్ థ్రిల్లర్.. 'మదరాశి' ట్రైలర్ అదిరింది!
2018లో మిస్ ఆసియా టూరిజం కిరీటం
ఆమె 'హ్యాండ్‌మేడ్ విత్ లవ్ బై తాన్యా' అనే పేరుతో సొంత బ్రాండ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ బ్రాండ్ ద్వారా హ్యాండ్‌బ్యాగులు, హ్యాండ్‌క్రాఫ్ట్స్, చీరలు వంటి ఉత్పత్తులను అందిస్తారు. 2018లో మిస్ ఆసియా టూరిజం కిరీటాన్ని తాన్యా మిట్టల్ గెలుచుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆమె భారత్ కు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడామె బిగ్ బాస్ 19వ సీజన్ లోకి అడుగుపెట్టారు. ఈ షోలో తాన్యా మిట్టల్ ఒక బలమైన పోటీదారుగా నిలుస్తారని ఆమె అభిమానులు భావిస్తున్నారు. హౌస్‌లోకి ప్రవేశించిన తాన్యా తన కలలు, తన గత జీవితం గురించి సల్మాన్ ఖాన్‌తో మాట్లాడారు. హౌస్‌లో ఆమె తన లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను వదలుకోలేనని చెబుతూ తనతో పాటు 9 సూట్‌కేసులను తీసుకొచ్చినట్లుగా వెల్లడించారు.
Also Read : Hyderabad: లవర్తో కలిసి మొగుణ్ని లేపేసింది బండరాయితో.. హైదరాబాద్లో మరో దారుణం!
ఈ బిగ్ బాస్ షో డిజిటల్‌గా జియో సినిమా, టీవీలో కలర్స్ ఛానెల్‌లో ప్రసారం అవుతుంది. ఈ సీజన్‌లో ఇంటిలోని చిన్న పెద్ద నిర్ణయాలు కూడా పూర్తిగా కంటెస్టెంట్స్ చేతుల్లోనే ఉంటాయి. ఇది షోలో చాలా డ్రామా మరియు పోరాటాలకు దారితీస్తుందని హోస్ట్ సల్మాన్ ఖాన్ చెప్పారు. హోస్ట్ సల్మాన్ ఖాన్ ఈ సీజన్‌కు రూ.120-150 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. గతంలో రూ.1000 కోట్లు అని కూడా పుకార్లు వచ్చాయి, కానీ సల్మాన్ వాటిని ఖండించారు.
Also Read : Madharaasi Trailer: ఏఆర్ మురుగదాస్ మరో యాక్షన్ థ్రిల్లర్.. 'మదరాశి' ట్రైలర్ అదిరింది!