Vishal 35 Makutam: పోర్ట్ ఏరియా డాన్ గా విశాల్.. 'మకుటం' టైటిల్ టీజర్ అదిరింది భయ్యా !

తమిళ్ హీరో విశాల్ తన కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు.  'మకుటం' అనే టైటిల్ తో ఈ సినిమాను ప్రకటించారు. ఇది విశాల్ 35వ చిత్రంగా తెరకెక్కనుంది. ఈ మేరకు టైటిల్ టీజర్ విడుదల చేశారు మేకర్స్.

New Update

Vishal 35 Makutam: తమిళ్  హీరో విశాల్ తన కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు.  'మకుటం' అనే టైటిల్ తో ఈ సినిమాను ప్రకటించారు. ఇది విశాల్ 35వ చిత్రంగా తెరకెక్కనుంది. ఈ మేరకు టైటిల్ టీజర్ విడుదల చేశారు మేకర్స్. సముద్రం, పోర్ట్ ఏరియా నేపథ్యంలో టీజర్ ఆకట్టుకుంటోంది. టీజర్ ప్రారంభంలోనే సముద్రంలో  చేపలు, భారీ సొరచేపలను చూపిస్తూ అందులో నుంచి ఒక ఆక్టోపస్ భారీ  ఓడను ఎక్కుతూ పైకి రావడం వంటి విజువల్స్ ఆసక్తిని కలిగించాయి. దీనిప్రకారం పోర్ట్ ఏరియా ఆధిపత్యం కోసం సాగే ఒక కథగా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే పోర్ట్ ఏరియాలో జనం కేకలు, కేరింతల మధ్య విశాల్ చేతిలో సిగరెట్ పట్టుకొని ఒక డాన్ లా కనిపించడం భారీ హైప్ క్రియేట్ చేసింది.

 రెండవ సినిమా..

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ. ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో దుషారా విజయన్‌  హీరోయిన్ గా నటిస్తుండగా.. స్టార్ నటి అంజలి కీలక పాత్రల్లో నటించనున్నారు. అంజలి- విశాల్ కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది. రీసెంట్ గా వీరిద్దరి కాంబోలో 'మద గజ రాజా' మూవీ వచ్చింది. చిత్రీకరణ తర్వాత దాదాపు 12 ఏళ్ళకు థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

దీంతో పాటు విశాల్  'తుప్పరివాలన్ 2', మగుదం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇవి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. 2017లో విడుదలైన 'తుప్పరివాలన్' సీక్వెల్ గా 'తుప్పరివాలన్ 2' తెరకెక్కిస్తున్నారు. ఇందులో విశాల్ హీరోగా నటించడంతో పాటు ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. 

కుప్పకూలిన విశాల్.. 

ఇదిలా ఇలా ఉంటే ఓ ఈవెంట్ లో విశాల్ సడెన్ గా కుప్పకూలిపోవడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. తమిళనాడులోని విల్లుపురంలో ఓ ఈవెంట్ కి హాజరైన విశాల్.. అక్కడ స్టేజ్ పై స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయన మేనేజర్ హరి కృష్ణన్ దీనిపై వివరణ ఇచ్చారు. విశాల్ అనారోగ్యంతో ఉండడం వల్ల అలా జరిగిందని తెలిపారు. రెండు మూడు రోజులుగా జ్వరం, అలసటతో బాధపడుతున్నారని, దానికి తోడు ఆ రోజు మధ్యాహ్నం భోజనం స్కిప్ చేయడంతో మరింత నీరసించిపోయారని చెప్పారు. 

Also Read: OG MOVIE: పవన్ 'OG'  నైజాం హక్కుల కోసం దిల్ రాజు భారీ ప్లాన్ ! అంత మొత్తం పెడుతున్నారా?

Advertisment
తాజా కథనాలు