/rtv/media/media_files/2025/06/28/actress-ileana-welcomes-second-child-son-kianu-rafe-dolan-2025-06-28-08-23-47.jpg)
Actress Ileana welcomes second child son kianu rafe dolan
టాలీవుడ్‌లో ఒకప్పుడు ఓ ఊపు ఊపేసిన గోవా బ్యూటీ ఇలియానా తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. ఆమె రెండోసారి తల్లి అయినట్లు తెలిపింది. ఈ సారి కూడా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. ఈ సంతోషకరమైన విషయాన్ని ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అంతేకాకుండా ఆ బిడ్డ పేరు కూడా తెలిపింది.
Also Read : కాళ్లు పట్టుకున్నా వదల్లేదు.. కోల్‌కతా రేప్ కేసులో షాకింగ్ విషయాలు
Also Read : గుడ్ న్యూస్.. ఓయూలో 250, కాకతీయలో 145 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ
మరోసారి తల్లైన ఇలియానా
ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ప్రకారం.. తనకు ఈ నెల 19న మగబిడ్డ జన్మించినట్లు పేర్కొంది. ఆ బిడ్డకు ‘కియాను రాఫె డోలన్’ అనే పేరు పెట్టినట్లు తెలిపింది. ఇందులో భాగంగా తన కొడుకు ఫొటోను షేర్ చేసింది. తమ కుటుంబంలోకి రెండో అబ్బాయి కియాను రాఫె డోలన్‌కు స్వాగతం అంటూ ఆ పోస్టు ద్వారా తన ఆనందాన్ని పంచుకుంది. ఈ సర్ ప్రైజ్‌తో ఇలియానా అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇలియానా తన ప్రియుడు మైఖేల్ డోలన్‌ను 2023లో పెళ్లి చేసుకున్నారు. ఈ లవ్ కపుల్‌కి 2023లో మొదటి కుమారుడు జన్మించాడు. అతడికి ‘కోవా ఫీనిక్స్ డోలన్’ అనే పేరు పెట్టారు. ఇప్పుడు రెండేళ్ల తర్వాత మరో మగ బిడ్డకు ఇలియానా జన్మనిచ్చింది.
Also Read : తాజ్ మహల్‌కు పగుళ్లు.. డేంజర్ జోన్‌లో ప్రేమ చిహ్నం
Also Read : కారులో ఫ్రంట్ సీట్ కోసం తండ్రిని కాల్చి చంపిన కొడుకు!
ileana-delivered-baby-boy | ileana-dcruz