తమిళ కమెడియన్ సంతానం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తన కామెడీతో ఎంతో మంది సినీ ప్రియుల్ని అలరించాడు. తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ సంతానం సుపరిచితుడే. అయితే ఇప్పుడు అతడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పలు సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. దీంతో వరుస సినిమాలను లైన్‌లో పెట్టేశాడు.
Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?
చిక్కుల్లో నటుడు సంతానం
అయితే తాజాగా ఈ నటుడు చిక్కుల్లో పడ్డాడు. అతడిపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇప్పుడా వివాదం మరింత తీవ్రస్థాయికి వెళ్లడంతో నటుడు సంతానం స్పందించాడు. ఇంతకీ అతడు ఎందుకు చిక్కుల్లో పడ్డాడు.. దానికి గల కారణం ఏంటి? అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?
సంతానం హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్’. ఈ చిత్రం మే 16వ తేదీన గ్రాండ్ లెవెల్లో తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ఇటీవల ‘శ్రీనివాస గోవింద’ అంటూ సాగే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే సాంగ్ వివాదానికి దారి తీసింది. ఆ సాంగ్‌లో పార్కింగ్ డబ్బులు గోవిందా.. పాప్ కార్న్ ట్యాక్స్ గోవిందా అని ఉండటంతో తమిళనాడులోని హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. వెంటనే ఆ సాంగ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై తాజాగా హీరో సంతానం స్పందించాడు.
రీసెంట్‌గా ఓ ప్రెస్ మీట్ జరగ్గా.. అందులో ఈ ఇష్యూపై మాట్లాడాడు. తిరుమల శ్రీవారిని తాము అవమానించలేదని అన్నాడు. సెన్సార్ బోర్డ్ నిబంధనల ప్రకారమే సినిమా తీశామని చెప్పాడు. సినిమా రిలీజ్ టైంలో రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారని.. వాటిన్నింటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా మరోవైపు ఇప్పటికే ఈ మూవీ సాంగ్‌పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్ కూడా మేమే
latest-telugu-news | telugu-news | movie-news | Actor Santhanam