Allu Arjun : ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్కు.. బన్నీకి బెయిల్ రూల్స్

అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కేసు గురించి ఎవరితో మాట్లాడవద్దు. సాక్షులను ప్రభావితం చేయవద్దు. వీటితో పాటుగా ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు రెండు నెలల పాటు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది.

New Update
court allu

court allu Photograph: (court allu )

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ అయితే ఇచ్చింది. ఈ సందర్భంగా కోర్టు  అల్లు అర్జున్‌కు పలు  షరతులు కూడా విధించింది. కేసు గురించి ఎవరితో మాట్లాడవద్దన్న కోర్టు..  సాక్షులను ప్రభావితం చేయవద్దని ఆదేశించింది. అంతేకాకుండా కేసును ప్రభావితం చేసేలా కామెంట్ప్ చేయవద్దంది.  వీటితో పాటుగా ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు రెండు నెలల పాటు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాది అశోక్‌ రెడ్డి తెలిపారు. అటు  బన్నీకి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు నాంపల్లి కోర్టులో వాదించారు. అల్లు అర్జున్‌ డబ్బున్న వాడని..  సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ వాదించారు.  కానీ ఇరువైపుల  వాదనలు విన్న కోర్టు చివరకు బన్నీకి షరుతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.  

Also Read :  'విశ్వంభర' టీమ్ లో మార్పులు.. మేకర్స్ నిర్ణయం వెనక రీజన్ ఇదేనా?

అల్లు అర్జున్ పై కేసు ఏంటీ?

2024 డిసెంబర్ 04వ తేదీన పుష్ప2 (Pushpa 2) బెనిఫిట్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో గాయపడిన ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  దీనిపై రేవతి  భర్త భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.  అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరుచగా..  కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు.  ఇది జరిగిన కాసేపటికే హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో మరుసటిరోజు విడుదలయ్యారు.

నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు బన్నీ.  అదే రోజున అల్లు అర్జున్‌ (Allu Arjun) తరఫు న్యాయవాదులు రెగ్యులర్‌ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు ఇలా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్  కుటుంబానికి పుష్ప2 మేకర్స్  అండగా నిలిచారు.  హీరో అల్లు అర్జున్ కోటి రూపాయలు, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు తలో రూ. 50 లక్షల పరిహారం అందజేశారు. 

Also Read :  హీరోయిన్‌గా బ్రాహ్మణి..  బాలయ్యకు ఫోన్ చేసిన మణిరత్నం

Advertisment
Advertisment
తాజా కథనాలు