ChatGPT: టెక్కీల కొంపముంచుతోన్న ఛాట్‌జీపీటీ.. తప్పుడు సమాధానాలు చెబుతున్న ఏఐ!

ఛాట్‌జీపీటీ తప్పుల తడక బయటపడింది. టెక్కీలు అడుగుతున్న ప్రశ్నలకు ఛాట్‌జీపీటీ రాంగ్‌ ఆన్సర్స్‌ ఇస్తుందని పరిశోధకులు తేల్చారు. ఓ నివేదిక ప్రకారం మొత్తం 512ప్రశ్నలకు ఛాట్‌జీపీటీ 259వాటికి తప్పుడు సమాధానాలు చెప్పింది. అంటే 52శాతం రాంగ్‌ ఆన్సర్స్‌ అన్నమాట. దీంతో ప్రాజెక్టుల సలహాల కోసం మళ్లి 'స్టాక్‌ ఓవర్‌ఫ్లో'నే నమ్ముకుంటున్నారు టెక్కీలు.

ChatGPT: టెక్కీల కొంపముంచుతోన్న ఛాట్‌జీపీటీ.. తప్పుడు సమాధానాలు చెబుతున్న ఏఐ!
New Update

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లకు ChatGPT తప్పు సమాధానాలు: ఛాట్‌జీపీటీ(ChatGPT)ని అతిగా నముతున్నారా? అడిగిన వెంటనే ఆన్సర్ ఇస్తాడు కదా అని ప్రతి డౌట్‌ని టైప్ చేసి పడేస్తున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పింది కదా అని గుడ్డిగా ఫాలో అవుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి.. ఛాట్‌జీపీటీ చెప్పిన ఆన్సర్లను క్రాస్ చెక్ చేసుకోకపోతే మీ ఉద్యోగం ఊడిపోవచ్చు. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అడిగిన ప్రశ్నలకు మాత్రం ఛాట్‌జీపీటీ తప్పుడు సమాధానాలు చెబుతాయని నివేదికలు తేల్చాయి. అది కూడా ఒకటి అర తప్పులు కాదండోయ్.. 100 ప్రశ్నలు అడిగితే అందులో 52తప్పులు చెబుతుందట. మీరు నమ్మలేకున్నా ఇదే నిజం.

ఛాట్‌జీపీ వర్సెస్ స్టాక్‌ ఓవర్‌ఫ్లో:

నిజానికి ప్రాజెక్ట్‌ల కోసం సలహాలు అవసరమయ్యే ప్రోగ్రామర్‌లు ఎక్కువగా స్టాక్ ఓవర్‌లో బాక్స్. అయితే ఛాట్‌జీపీటీ ఎంట్రీ తర్వాత టెక్కీల మైండ్‌సెట్‌ మారింది. ఎక్కువగా ఛాట్‌జీపీపై ఆధారపడడం మొదలుపెట్టారు. అంతకముందు స్టాక్‌ ఓవర్‌ఫ్లో మీద డిపెండ్ అయిన టెక్కీలు రూట్ మార్చారు. అయితే వారు చేసింది ఎంత తప్పో తెలియడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఎందుకంటే ఛాట్‌జీపీటీ రాంగ్‌సర్లు ఇస్తుందని వారికి అర్థమైపోయింది. క్రాస్‌ చెక్ చేసుకునే అలవాటు ఉన్న టెక్కీలు అవే ప్రశ్నలను స్టాక్‌ ఓవర్ ఫ్లోని అడగగా అసలు విషయం బయటపడింది. ఇలా ఒకటి కాదు రెండు ఏకంగా 52 శాతం తప్పులు కనిపించాయి. మొత్తం 512 ప్రశ్నల్లో 259వాటికి ఛాట్‌జీపీటీ రాంగ్ ఆన్సర్ ఇచ్చింది.



రెండిటికి తేడా ఏంటి?

నిజానికి స్టాక్‌ ఓవర్‌ఫ్లో నుంచి వచ్చే సజెషన్స్‌ కాస్త లేట్. ఛాట్‌జీపీటీ మాత్రం ఇన్‌స్టెంట్‌గా వర్క్‌ చేసి పెడుతుంది. అందుకే టైం కూడా సేవ్ అవుతుందన్న ఆలోచనతో ఛాట్‌జీపీటీకి వర్క్‌ ఇస్తున్నారు టెక్కీలు. అయితే లేట్‌గా ఇచ్చినా  స్టాక్ ఓవర్ ఫ్లో ఆన్సర్‌ ని అక్యూరేట్‌గా ఇస్తుంది. అటు ఛాట్‌జీపీటీ మాత్రం అలా కాదు. ప్రాజెక్టులకు సంబంధించి రాంగ్ ఆన్సర్లు ఇస్తుందని తేలింది. ఇక కరెక్ట్ ఇచ్చిన 48 శాతం ఆన్సర్లు పరఫెక్ట్‌గా ఇచ్చిందట ఛాట్‌జీపీటీ. దీనిబట్టి చూస్తే టెక్కీల పరంగా ఛాట్‌జీపీటీని నమ్మడం ఏ మాత్రం మంచిది కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.మిగిలిన విషయాల్లో ఛాట్‌జీపీటీ ఎలాంటి సమాధానాలు చెబుతుందో.. వాటిలో తప్పులు ఉన్నాయో లేవో లాంటివి ముందుముందు తెలుస్తాయి. ఎందుకంటే ఇది ఇప్పుడెప్పుడే మొదలువుతున్న టెక్ట్ ట్రెండ్. ఏ టెక్నాలజీ అయినా లోపాలు లేకుండా ఉండదన్న ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.

ఇది కూడా చదవండి: ఈ కజిన్‌తో ముప్పు తప్పదా? కొత్త వేరియంట్‌తో కసికసిగా కోవిడ్ కాటు!

#software-engineers #chatgpt #ai-chatgpt #artificial-intelligence #chatgpt-ai #chatgpt-issues #chat-gpt-giving-wrong-answers #chatgpt-wrong-answers #what-is-chatgpt
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe