chandrababu:ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు

ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కావాలని లంచ్ మోషన్ పిటిషన్‌ను చంద్రబాబు తరపు న్యాయవాదులు వేశారు. దీన్ని మధ్యాహ్నం విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Chandrababu:ఏపీ హైకోర్టులో నేడు చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ
New Update

ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కావాలని లంచ్ మోషన్ పిటిషన్‌ను చంద్రబాబు తరపు న్యాయవాదులు వేశారు. దీన్ని మధ్యాహ్నం విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు నారా లోకేష్ కూడా హైకోర్ట్ లో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ ను నారా లోకేష్ దాఖలు చేశారు.ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు ఈ రోజు ఉదయం డిస్పోజ్ చేసింది. విచారణకు సహకరించాలని లోకేష్‌ ను ఆదేశించింది. లోకేష్‌ కు 41 ఏ నోటీస్ ఇవ్వమని అధికారులను ఆదేశించింది. 41 ఏ నోటీసు ఇస్తామని కోర్టుకు ఏజీ శ్రీరామ్ తెలిపారు. ఏపీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా ఉన్న నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు ఢిల్లీ బయలుదేరారు. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్, కేసుల విషయంలో ఆయన న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు.

స్కిల్ డెవలప్‌ మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే రిమాండ్‌లో ఉండగా.. తాజాగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రహ్మణిల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లుగా తెలుస్తోంది. రేపో మాపో అమరావతి రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు వ్యవహారంలోనే వీరిద్ధరినీ కూడా అరెస్ట్‌ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే 11 బృందాలు ఈ కేసు దర్యాప్తులో ముమ్మరంగా ముందుకెళ్తున్నాయి. అమరావతి రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు వ్యవహారంలోనే వీరిద్ధరినీ అరెస్ట్‌ చేస్తున్నట్లు సమాచారం.

#nara-lokesh #high-court #chandrababu #ap #petition #bail #petiton #lunch-motion #filed
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe