California Helicopter Crash: అమెరికాలోని కాలిఫోర్నియా - నెవడా సరిహద్దుల్లో ఓ హెలికాప్టర్ కూప్పకూలడం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో నైజీరియాకు చెందిన అతిపెద్ద బ్యాంక్ సీఈఓతో పాటు మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. 'యాక్సెస్ బ్యాంక్' సీఈఓ హెర్బర్ట్ విగ్వే (Access Bank CEO Herbert Wigwe) తన భార్య, కొడుకు మరికొందరితో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారు. మోజువా ఎడారిపై వెళ్తుండగా.. శాన్ బ్రెనార్డినో కౌంటీ వద్ద శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.
Also Read: ఐపీఎల్ బ్యూటీ నవ్వింది.. సోషల్ మీడియా షేక్ అయింది!
సుమారు 3 వేల అడుగుల ఎత్తు నుంచి అది కుప్పకూలడంతో.. అందులో ప్రయాణిస్తున్నవారు ఎవరూ కూడా ప్రాణలతో బయటపడలేదు. దగ్గర్లోని ఓ జాతీయ రహదారిపై ప్రయానిస్తున్నవారు ఈ ప్రమాదాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంపై ఎఫ్‌ఏఏ (FAA) విచారణ చెపట్టింది. ఇందులో చనిపోయినవారిలో నైజీరియాకు (Nigeria) చెందిన ఎన్‌జీఎక్స్ గ్రూపు మాజీ ఛైర్మన్ అబింబోలా (Abimbola), ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు.
ఈ ఘటన జరిగిన అనంతరం.. ఆఫ్రికా బ్యాంకింగ్ రంగానికి ఇది పెద్ద షాక్ అంటూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఎవాలా ఎక్స్‌లో స్పందించారు. హెర్బర్ట్ విగ్వే గతంలో గ్యారెంటీ ట్రస్ట్ అనే బ్యాంకులో కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. అయితే నైజీరియా యాక్సెస్ బ్యాంక్ ఆఫ్రికాలోని పలు దేశాల్లో సేవలను అందిస్తోంది. ఇదిలాఉండగా.. ఈ మధ్యే అమెరికాలోని శాన్ డియాగో వద్ద ఓ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలి ఐదుగురు సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే తాజాగా ఈ ఘటన జరిగింది.
Also Read: రిగ్గింగ్, రీపోలింగ్ రగడ.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్!