/rtv/media/media_files/2024/10/23/d4SyM0qtXrihuWGNNOaJ.jpg)
ఫేమస్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్ జొమాటో యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. జొమాటో ప్లాట్‌ఫాం నష్టాల్ని తగ్గించుకొనేందుకు కొత్తగా ఛార్జీల వసూలు చేయాలని భావిస్తోంది. దూరానికి బట్టి లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజును ప్రారంభించింది. అంటే ఇకపై దూరంగా ఉన్న హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆ మేరకు ఛార్జీలు ఉంటాయి. కస్టమర్ లొకేషన్ నుంచి 4 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేస్తే లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజు వర్తిస్తుంది.
Also Read : RCB vs SRH : టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు
Zomato Launches Long Distance Service Fee
Zomato Rolls Out Extra Fees for Distant Deliveries! pic.twitter.com/HFhB1Qz8iA
— Marketing Maverick (@MarketingMvrick) May 22, 2025
Also read: Covid-19: బెంగళూరులో 9 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్
రెస్టరంట్, డెలివరీ అడ్రస్ మధ్య దూరం 4 నుంచి 6 కిలోమీటర్లు ఉండి ఆర్డర్ విలువ రూ.150 దాటితే కస్టమర్లకు రూ.15 వసూలు చేయనున్నారు. అదే 6 కిలోమీటర్ల పరిధి దాటితే ఆర్డర్ విలువతో సంబంధం లేకుండా నగరాన్ని బట్టి సర్వీస్ ఛార్జి రూ.25 నుంచి రూ.35 వరకు ఉంటుంది. కొవిడ్ విజృంభనకు ముందు జొమాటో 5 కిలోమీటర్ల లోపు ఫుడ్ డెలివరీకి ఎలాంటి ఛార్జీలు విధించేది కాదు. కోవిడ్ వ్యాపించిన తర్వాత అనేక రెస్టరంట్లు తాత్కాలికంగా మూతపడిన సమయంలో ఆ డెలివరీ పరిధిని 15 కిలోమీటర్ల వరకు పెంచింది. తర్వాత క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. డెలివరీ ఫీజును మొదలుపెట్టింది. ఇప్పుడు దూరాన్ని బట్టి ఫీజు వసూలుచేయాలని నిర్ణయించింది.
Also Read : పాక్ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన భారత్
Also Read : కాసేపట్లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకి కవిత...KCRతో భేటీ!
zomato | Zomato Food Rescue | zomato-large-order-fleet | Zomato increased platform fees | long distance service fee | latest-telugu-news