Kavitha : కాసేపట్లో శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకి కవిత...KCRతో భేటీ!

అమెరికాకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకి రానున్నట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ నుండి నేరుగా ఆమె ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ సీఎం కేసీఆర్‌తో కవిత సమావేశమయ్యే అవకాశం ఉంది.

New Update

అమెరికాకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకి రానున్నట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ నుండి నేరుగా ఆమె ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ సీఎం కేసీఆర్‌తో కవిత సమావేశమయ్యే అవకాశం ఉంది. రాత్రి 7:30 నిమిషాలకు ఎయిర్ పోర్టుకి కవిత చేరుకుంటారని సమాచారం. ఎయిర్ పోర్టు వద్ద భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు కార్యకర్తలు. కాగా ఈ నెల 16 న తన భర్త అనిల్ లో కలిసి అమెరికాకు వెళ్లిన కవిత..  తన కొడుకు కాన్వకేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.  ఈ క్రమంలో రాష్ట్రంలో తన తండ్రి కేసీఆర్ కు ఆమె ఓ లేఖ రాసినట్లుగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. దీనిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మరి దీనిపై కవిత ఎలా స్పందిస్తారో అన్నది చూడాలి. మరోవైపు కవిత లేఖపై స్పందించేందుకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ నిరాకరించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు