కుప్పకూలిన ప్రపంచ స్టాక్ మార్కెట్లు.. ట్రంప్ దెబ్బకు చరిత్రలో మొదటిసారి..

ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత చరిత్రలో మొదటిసారి రూపాయి విలువ భారీగా పతమవుతోంది. నిఫ్టీ కూడా 200 పాయింట్లు తగ్గింది. మెక్సికో, కెనడా, చైనాలపై అమెరికా సుంకాల ఎఫెక్ట్ భారీగా పడింది.

New Update
Stock Markets:నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market crash Photograph: (Stock Market crash )

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దెబ్బకు ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మెక్సికో, కెనడా, చైనాలపై అమెరికా సుంకాల ఎఫెక్ట్ కారణంగా స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. మూడు శాతం దాకా జపాన్, దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. 25% సుంకాలు ప్రపంచ మార్కెట్లలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ 2.5 శాతం తగ్గగా.. గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్లకు తగ్గింది. బిట్ కాయిన్ 91000కి క్రాష్ అయ్యింది. ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ 110 వద్ద ఉంది.

ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!

ఇది కూడా చూడండి: India vs England 5th T20I: టీమిండియా ఘన విజయం.. ఇంగ్లండ్ చిత్తు చిత్తు!

 భారీగా పతనమవుతున్న రుపాయి విలువ..

డాలర్ ఇండెక్స్ తగ్గకపోతే ఆర్థిక వ్యవస్థలను దెబ్బ తీసే అవకాశం టారిఫ్‌లకు ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. మున్ముందు చాలా దేశాలు నష్టాల బాట పడతాయని నిపుణులు అంటున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్లే రూపాయి విలువ పతనం అవుతుంంది. ఎక్కువగా డాలర్‌పై ఆధారపడి ఉన్న ఆసియా కరెన్సీలో పతన మవుతున్నాయి. చరిత్రలో మొదటిసారి రూపాయి విలువ రూ.87కి పడిపోయింది. ప్రస్తుతం డాలర్‌తో చూస్తే రూపాయి విలువ రూ. 87.20 వద్ద ట్రేడవుతోంది. 

ఇది కూడా చూడండి: Israel: నెతన్యాహు సతీమణి పై నేర విచారణ!

ఇది కూడా చూడండి: Vasant Panchami : నేడు వసంత పంచమి.. బాసరకు పోటెత్తిన భక్తులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు