/rtv/media/media_files/2025/08/16/whatsapp-2025-08-16-13-26-36.jpg)
WhatsApp Web: వాట్సాప్ అనేది మనిషి జీవితంలో కీలకంగా మారింది. ప్రపంచంలో అత్యధికమంది వాడే మెసేజింగ్ యాప్‌గా అవతరించింది. అయితే వాట్సాప్ వినియోగదారులను హెచ్చరించింది. భారత ప్రభుత్వం, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆఫీస్ కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్ వెబ్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఈ హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్ వెబ్‌ను ఆఫీస్ సిస్టమ్స్ లో వాడినప్పుడు, వ్యక్తిగత చాట్‌లు, ఫైళ్లు, ఫోటోలు, వీడియోలు సంస్థకు సంబంధించిన అడ్మినిస్ట్రేటర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
Also Read : Jewelry Heist : 2 నిమిషాల్లో 2 మిలియన్ డాలర్ల ఆభరణాలు చోరీ..వీడియో వైరల్
చాలా కంపెనీలు తమ ఉద్యోగుల చేసే పనులను పర్యవేక్షించడానికి స్క్రీన్ మానిటరింగ్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తాయి. అయితే ఈ సాఫ్ట్‌వేర్‌ల ద్వారా వ్యక్తిగత చాట్‌లను కూడా వారు చూడగలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా ఆఫీస్ సిస్టమ్‌లలో ఉండే మాల్‌వేర్, బ్రౌజర్ హైజాక్‌లు వాట్సాప్ డేటాను ఈజీగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. తద్వారా మీ వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. సైబర్ భద్రతపై కార్యాలయాల్లో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఎంఈఐటీవై(MEITY) నుంచి ఈ హెచ్చరిక తాజాగా జారీ అయింది.
Also Read: "50 ఏళ్ల లెజెండరీ జర్నీకి హాట్స్ ఆఫ్..!" మోడీ, చంద్రబాబు విషెస్ కు తలైవర్ రిప్లై ఇదే..
వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడానికి
ఈ ప్రమాదాల నుంచి రక్షించుకోవడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ కొన్ని సూచనలు ఇచ్చాయి. ఆఫీస్ కంప్యూటర్ లో వాట్సాప్ వెబ్(WhatsApp Web) ను అస్సలు ఉపయోగించవద్దంది. ఇది మీ వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడానికి ఇది చాలా ముఖ్యమని అభిప్రాయపడింది. మీ వ్యక్తిగత ఫోన్‌లోనే వాట్సాప్‌ను వాడటం ఉత్తమని వెల్లడించింది. ఇక వ్యక్తిగత ఫోన్‌కు ఆఫీస్ వై–ఫైని ఉపయోగించడం కూడా శ్రేయస్కరం కాదంది. నెట్‌వర్క్ సురక్షితంగా లేకున్నా, పర్యవేక్షణ వ్యవస్థలు ఉన్నా ప్రైవేట్ డేటా ప్రమాదంలో పడుతుందని సూచించింది.
Also Read: Jharkhand : బాత్రూంలో జారిపడి జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి కన్నుమూత!
వాట్సాప్ ఉపయోగిస్తున్నప్పుడు ఫోన్‌ను ఆఫీస్ వైఫైకి కనెక్ట్ చేయడం వలన వ్యక్తిగత డేటా లీక్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అత్యవసరంగా ఆఫీస్ కంప్యూటర్‌లో వాట్సాప్ వెబ్ ఉపయోగించినా, పని పూర్తయిన వెంటనే లాగ్ అవుట్ అవ్వడం తప్పనిసరని సూచించింది. మీ కంపెనీ యొక్క IT పాలసీలను సరిగా తెలుసుకోండి. వ్యక్తిగత యాప్‌లు మరియు సాఫ్ట్‌వేర్‌లను ఆఫీస్ సిస్టమ్స్‌లో ఉపయోగించడంపై ఏమైనా నిబంధనలు ఉన్నాయేమో చూసుకోండి.
Also Read: Trump-Putin Meet: పుతిన్ కు ఆర్య-2 సినిమా చూపించిన ట్రంప్.. అగ్రరాజ్యం బలుపు చూపెట్టిన అమెరికా.. ఈ వీడియోలు చూడండి!