/rtv/media/media_files/2025/08/26/elon-musk-sues-2025-08-26-08-14-13.jpg)
Elon Musk sues
ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఉన్న ప్రాధాన్యత కారణంగా కొన్ని కంపెనీల మధ్య పోటీ మొదలైంది. ఓపెన్ ఏఐ ఈ రంగాన్ని ఏలుతోంది. ఈ కంపెనీ ఎలన్ మస్క్ బీట్ చేయాలని చూస్తున్నారు. కృత్రిమ మేధస్సు రంగంలో కీలకంగా ఉన్న కంపెనీల మధ్య ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. టెస్లా, ఎక్స్, స్పేస్‌ఎక్స్ వంటి సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ xAI, ఆపిల్ మరియు ఓపెన్ఏఐలపై అమెరికాలోని టెక్సాస్ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. కృత్రిమ మేధస్సు పోటీని అణచివేయడానికి ఈ రెండు సంస్థలు కుట్ర పన్నాయని xAI ఆరోపించింది.
Elon Musk is suing Apple, $AAPL & OpenAI, calling it “a tale of two monopolists.” 🚨
— Tradepal (@tradepal_app) August 25, 2025
Apple quiet. OpenAI says Musk is just harassing. pic.twitter.com/4hXneNrL0h
ఈ దావా ప్రకారం, ఆపిల్ తన ఐఫోన్లలో ఓపెన్ఏఐకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న ఇతర సంస్థల ఎదుగుదలను అడ్డుకుంటోందని, మార్కెట్ పోటీని దెబ్బతీస్తోందని ఎలన్ మస్క్ ఆరోపించారు. ముఖ్యంగా, ఆపిల్ తన ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఓపెన్ AI చాట్‌జీపీటీని విలీనం చేసుకున్న తర్వాత ఈ వివాదం మరింత తీవ్రమైంది. దీంతో ఆపిల్ వినియోగదారులు ఇతర ఏఐ చాట్‌బాట్‌లను ఉపయోగించకుండా నిరోధించబడుతున్నారని మస్క్ ఆరోపించారు.
xAI తన దావాలో ఆపిల్, ఓపెన్ఏఐ కలిసి మార్కెట్‌ను గుత్తాధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. ఈ ఒప్పందం వల్ల ఆపిల్ యాప్ స్టోర్‌లో ఓపెన్ఏఐకి చెందిన చాట్‌జీపీటీకి మాత్రమే అగ్రస్థానం దక్కుతోందని, ఇది xAIకి చెందిన 'గ్రాక్' వంటి వినూత్న ఉత్పత్తులను వెనక్కి లాగుతోందని ఆరోపించింది. దీని వల్ల xAI బిలియన్ల కొద్దీ డాలర్ల నష్టాన్ని చవి చూసిందని, ఈ నష్టాన్ని భర్తీ చేయాలని కోరుతూ కోర్టులో దావా వేసింది.
గతంలో కూడా మస్క్, ఓపెన్ఏఐపై అనేక ఆరోపణలు చేశారు. ఓపెన్ఏఐని స్థాపించిన వారిలో ఆయన ఒకరైనప్పటికీ, దాని లాభాపేక్ష లక్ష్యంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజా దావా మస్క్, ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ మధ్య ఉన్న పాత వైరాన్ని మరోసారి బహిర్గతం చేసింది. ఈ దావాపై ఆపిల్, ఓపెన్ఏఐ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, ఈ కేసు వల్ల టెక్నాలజీ ప్రపంచంలో ఏఐ గుత్తాధిపత్యంపై ఒక పెద్ద చర్చ మొదలయ్యే అవకాశం ఉంది.