/rtv/media/media_files/2025/04/14/iwcaYXYc5PnFU8aaJq5P.jpg)
WhatsApp: ప్రస్తుతం డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్, అందులో వాట్సాప్ అనేది కామన్. మెసేజింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అనేక ఫీచర్లను అందిస్తున్న వాట్సప్.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ల జాబితాలో మరో కొత్త అంశాన్ని చేర్చింది. ఈ కొత్త ఫీచర్ యూజర్లు తమ మెసేజ్ లను ఇంకా స్పష్టంగా, మెరుగ్గా, ఆకర్షణీయంగా పంపించడానికి సహాయపడుతుంది. దీని పేరు 'ఏఐ రైటింగ్ హెల్ప్' ఫీచర్.
Also Read: J&K Tragedy: 35కు చేరుకున్న వైష్ణోదేవి యాత్ర మృతుల సంఖ్య..డేంజర్ గా జీలం నది
కొత్త ఏఐ ఫీచర్
అయితే కొన్నిసార్లు ఒక సాధారణ మెసేజ్ పంపడం కూడా కష్టంగా అనిపిస్తుందని వాట్సాప్ గుర్తించింది. ఇలాంటి సందర్భాల్లో యూజర్ కి అసిస్ట్ చేయడానికి ఏఐ రైటింగ్ అసిస్టెంట్‌ను తీసుకొచ్చింది వాట్సాప్. మీకు ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడినప్పుడు ఈ టూల్ హెల్ప్ చేస్తుంది. ప్రొఫెషనల్, ఫ్రెండ్లీ, ఓదార్పు మెసేజ్ ఇలా ఏ రకమైన మెసేజ్ మీరు రాయాలనుకుంటే.. దానికి తగిన సూచనలను ఈ ఏఐ ఫీచర్ కొన్ని సెకన్లలో ఇస్తుంది. ఆ తర్వాత ఏఐ జనరేట్ చేసిన మెసేజ్ ని మీరు డైరెక్ట్ గా పంపుకోవచ్చు లేదా మీకు నచ్చినట్లుగా, కావాల్సినట్లుగా మార్పులు చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా విడుదల చేస్తోంది. ప్రస్తుతం ఇది వాట్సాప్ టెస్టింగ్ వెర్షన్లో అందుబాటులోకి వచ్చింది.
WhatsApp Launches AI Writing Help Tool Powered by Private Processing on iOS and Android!
— WABetaInfo (@WABetaInfo) August 27, 2025
WhatsApp introduces a new AI Writing Help tool, providing users with secure, private suggestions to improve the clarity, tone, or style of their messages.https://t.co/xrovDbDvQnpic.twitter.com/p9ACFz95CG
ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి, మీరు చాట్‌లో టైప్ చేసేటప్పుడు ఒక పెన్సిల్ గుర్తు కోసం కనిపిస్తుంది. దానిపై నొక్కితే అది మీకు అసిస్ట్ చేస్తుంది. అయితే, దీనికి కొన్ని కండీషన్స్ ఉన్నాయి: ప్రస్తుతం ఈ 'ఏఐ రైటింగ్' టూల్ ఇంగ్లీష్ భాషలో, కేవలం అమెరికాలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఇతర భాషలు, దేశాలకు కూడా ఈ ఫీచర్‌ను తీసుకురానుంది వాట్సాప్.
మీరు రాసే టెక్స్ట్‌ను మరింత ప్రొఫెషనల్‌గా, ఎమోషనల్‌గా లేదా స్నేహపూర్వకంగా మార్చడానికి కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ద్వారా మీ మెసేజ్‌లను రీఫ్రేజ్ చేయవచ్చు లేదా పొలిష్ చేయవచ్చు.
ప్రైవసీ ..
ఈ ఫీచర్‌లో గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని వాట్సాప్ తెలిపింది. మీరు రాసిన మెసేజ్‌లు లేదా AI ఉపయోగించి మార్చిన మెసేజ్‌లు వాట్సాప్ సర్వర్‌లలో ఎక్కడా సేవ్ అవ్వవు. మీ చాట్ ప్రైవసీకి ఎటువంటి ఇబ్బంది ఉండదని వాట్సాప్ స్పష్టం చేసింది.
Also Read: Chatgpt Releationship: చాట్ GPTతో రిలేషన్.. మైనర్ బాలుడు సూసైడ్.. ఏమైందో తెలిస్తే షాక్!