/rtv/media/media_files/2025/09/30/verse-2025-09-30-11-17-00.jpg)
Verse
దేశంలో స్థానిక భాషలకు, AI సాంకేతికతకు పేరుగాంచిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ వెర్సే ఇన్నోవేషన్(Verse Innovation) ఆర్థికంగా లాభాల్లో ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరం అద్భుతమైన ఆర్థిక ప్రగతిని సాధించింది. కంపెనీ కార్యకలాపాలను బలోపేతం చేస్తూ లాభాల బాట పట్టింది. ఈ ఏడాది ఆదాయ వృద్ధిలో 88% పెరుగుదల సాధించడంతో పాటు, కంపెనీ వ్యయ నియంత్రణలోనూ మంచి ఫలితాలు సాధించింది. EBITDA బర్న్‌ను ఏకంగా 20 శాతం వరకు తగ్గించుకుని లాభదాయమైన ఫలితాలను సాధించింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో వెర్సే ఇన్నోవేషన్ భారీ విజయం సాధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.1,029 కోట్ల నుంచి రూ.1,930 కోట్లకు పెరిగింది. దాదాపుగా 88 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం కూడా 64 శాతం పెరిగి రూ. 2,071 కోట్లకు చేరింది. అలాగే ఖర్చులను సమర్థవంతంగా నియంత్రించింది. గతంలో కంపెనీ మార్జిన్ 89 శాతం ఉండగా.. ఇప్పుడు 38 శాతానికి వచ్చింది. అంటే కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు కంపెనీ ఆదాయాన్ని కూడా పెంచింది. వీటితో పాటు కార్యకలాపాల ఆదాయంలో సేవల ఖర్చు 112 శాతం నుంచి 77 శాతానికి తగ్గింది.
ఇది కూడా చూడండి: MEIL: మామను పంపించేందుకు.. రూ.10 వేల కోట్లు అప్పు తీసుకున్న మేఘా కృష్ణారెడ్డి.. వివరాలివే!
VerSe Innovation achieves 88% Revenue Growth; Cuts Burn by 20%, Poised for Group-Level Profitability in H2'FY26 with AI-Led Expansion@VerSe_Corporate#RevenueGrowth#languagetechnology#revenue#EBITDAhttps://t.co/MDalowMGWipic.twitter.com/YDwFgwNJ9x
— Business Wire India (@BWIndia) September 30, 2025
లాభాల దిశగా..
వెర్సే ఇన్నోవేషన్ ఇప్పుడు లాభాలు ఆర్జించే దిశగా ప్రయాణం చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో గ్రూప్ స్థాయిలో బ్రేక్-ఈవెన్ సాధించాలని, ఆ తర్వాత లాభాల బాట పట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం కేవలం ఖర్చులను తగ్గించడం ద్వారా మాత్రమే కాకుండా, ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాల కోసం ప్రయత్నిస్తోంది. కంపెనీ లాభాలను పెంచడానికి నాలుగు ప్రధాన వ్యూహాలను అనుసరిస్తోంది.
AI ఉపయోగించి
NexVerse.ai అనే తమ AI-ఆధారిత యాడ్-టెక్ ఇంజిన్‌ను ఉపయోగించి ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. అలాగే ప్రకటనదారులకు మరింత మెరుగైన ఫలితాలు ఇవ్వాలని భావిస్తోంది.
సబ్‌స్క్రిప్షన్ సేవలు
డైలీహంట్ ప్రీమియం సేవలను విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. దీని ద్వారా డబ్బు చెల్లించి ప్రత్యేక కంటెంట్‌ను కోరుకుని వినియోగదారులను ఆకర్షించాలని భావిస్తోంది.
క్రియేటర్‌లతో ప్రచారాలు
జోష్ యాప్‌లో ఆడియో కాలింగ్ సదుపాయంతో క్రియేటర్‌లు, యూజర్‌ల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయాలని భావిస్తోంది. అలాగే వెర్సే కొల్లాబ్ ద్వారా క్రియేటర్ ప్రచారాలను నిర్వహించాలని ప్రయత్నిస్తోంది.
సమర్థవంతంగా ఉపయోగించుకోవడం
ఇప్పటికే కొనుగోలు చేసిన మాగ్జ్టర్, వాల్యూలీఫ్ వంటి సంస్థలను తమ ప్రధాన వ్యాపారంలో సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా వ్యాపార సేవలు, కన్స్యూమర్ విభాగాలలో ఆదాయాన్ని మరింత పెంచుకోవచ్చని భావిస్తోంది.
ఇది కూడా చూడండి: Best Features smart Phone: ఐఫోన్ 17కు దీటుగా షావోమీ న్యూ సిరీస్.. 50ఎంపీ కెమెరా.. 7500mAh​ బ్యాటరీ.. పిచ్చెక్కించే ఫీచర్లు!