/rtv/media/media_files/2025/02/13/ABuoxTT6jZpscoSY9EFX.jpg)
MEHGA CEO Krishna
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీ అవినితీకి పాల్పడిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ మరో సారి వార్తల్లో నిలిచింది. ఇటీవల జరిగిన పదివేల కోట్ల భారీ డీల్ ఇందుకు కారణం. డీల్ అంటే ఆ సంస్థ మరో సంస్థను కొనుగోలు చేయడమో, మరో భారీ ప్రాజెక్టును చేజిక్కించుకోవడమో కాదు. ఆ సంస్థలో ఇద్దరు ప్రధాన భాగస్వాములు కాగా.. కృష్ణారెడ్డి మాత్రం అవినీతి ఆరోపణలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. అయితే.. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు ఆయన మామ పిచ్చిరెడ్డి. సంస్థలో ఆయన ప్రధాన వాటాదారుడు కూడా. ఇప్పడు కంపెనీని పూర్తిగా వశం చేసుకోవడానికి కృష్ణారెడ్డి స్కెచ్ వేస్తున్నారు.
Oaktree Capital Management loans Rs 10,000 crore to MEIL's Krishna Reddy for family buyout https://t.co/XijIzZyJmp
— Economic Times (@EconomicTimes) September 28, 2025
కంపెనీ వ్యవస్థాపకుడైన తన మామ పిచ్చిరెడ్డిని సాగనంపేందుకు ఆయన అప్పులు చేస్తున్నారు. పిచ్చిరెడ్డికి సంస్థలో 49% వాటా ఉంది. ఈ వాటాను కొనుగోలు చేసేందుకు కృష్ణారెడ్డి అంతర్జాతీయ పెట్టుబడుల దిగ్గజ సంస్థ ఓక్‌ట్రీ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ రూ. 10,000 కోట్ల అప్పు తీసుకుంటున్నారు. ఇందుకోసం 15 శాతం భారీ వడ్డీ చెల్లించేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు.
కృష్ణారెడ్డి, ఓక్‌ట్రీ సంస్థలు గత వారం ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద ఫైనాన్సింగ్ ఒప్పందాలలో ఇదొకటి కావడం గమనార్హం. కృష్ణారెడ్డి 2027 మార్చి నాటికి పి.పి. రెడ్డికి ఉన్న 49% వాటాను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. వేల కోట్ల విలువైన అనేక ప్రభుత్వ ప్రాజెక్టులు చేస్తున్న కృష్ణారెడ్డి రూ.10 వేల కోట్లు అప్పు చేయడం చర్చనీయాంశమైంది. అత్యధికంగా విలువైన ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిన వారిలో మేఘా సంస్థ రెండో ప్లేస్‌లో ఉంది. మొత్తం రూ.966 విలువైన ఎలక్టోరల్ బాండ్లు మేఘా సంస్థ పేరిట కొనుగోలైనట్టు ఈసీఐ లెక్కలు చెబుతున్నాయి. అలాంటి మేఘా సంస్థ అధినేతల్లో ఒకరు అయిన కృష్ణారెడ్డి అప్పులు చేయడం ఆసక్తికరంగా మారింది.