/rtv/media/media_files/2025/02/05/hYs9p7ABKFXNs69xLSS2.jpg)
Valentines Day best smart watch offers available Flipkart
ప్రేమికుల నెల వచ్చేసింది. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు ప్రేమ జంటలు తమ ప్రేమను రోజుకో రకంగా చెప్పుకుంటారు. దీనిని వాలెంటైన్స్ వీక్‌గా చెప్పుకుంటారు. ఈ వారం రోజుల పాటు ప్రేమ జంటలు తమ తమ ప్రేయసి లేదా ప్రియుడికి ఎంతో అందమైన, ఇష్టమైన బహుమతులు ఇచ్చుకుంటారు. రోజ్ డే నుంచి మొదలై వాలెంటైన్ డే వరకు వాలెంటైన్ వీక్ జరుపుకుంటారు. మరి మీరు కూడా అలాంటి ఓ అందమైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఫ్లి్ప్‌కార్ట్‌లో ది బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని మీ పార్టనర్‌కి ఇస్తే ఫిదా అవ్వడం ఖాయమనే చెప్పాలి. ఇక వీటి ధరలు కూడా ఎక్కువగా లేవు. అంతేకాకుండా ఆఫర్లతో మరింత తక్కువకే కొని సర్‌ప్రైజ్ చేసేయండి.
Also Read: Delhi: ఢిల్లీ ఎన్నికల పోలింగ్ షురూ..కేజ్రీవాల్ పై హర్యానాలో ఎఫ్ ఐఆర్
Fastrack Revoltt
స్మార్ట్‌వాచ్ కంపెనీల్లో ఫాస్ట్రాక్ అనేది ది బెస్ట్ కంపెనీగా చెప్పుకోవచ్చు. అందువల్ల ఒకమంచి స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నట్లయితే Fastrack Revoltt అనేది బెస్ట్ గా ఉంది. దీని అసలు ధర రూ.2,799 ఉండగా.. ఇప్పుడు 64 శాతం తగ్గింపుతో కేవలం రూ.999లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ తగ్గింపుతో మరింత తక్కువకే కొనుక్కోవచ్చు. ఇందులో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. బ్లూటూత్ కాలింగ్, హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్, హార్ట్ రేట్, స్లీప్ మోడ్, స్ట్రెస్ సహా మరెన్నో వాటిని ట్రాక్ చేస్తుంది.
Also Read: Cinema: తండేల్ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ఓకే చెప్పిన గవర్నమెంట్
Noise Loop
నాయిస్ లూప్ స్మార్ట్‌వాచ్ సైతం రూ.1000లోపే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.6,999 కాగా ఇప్పుడు రూ.999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లతో మరింత తక్కువకే కొనుక్కోవచ్చు. ఇందులో టిఎఫ్‌టి ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 550 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. అలాగే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, హెల్త్ ట్రాకింగ్, 27/7 హార్ట్ రేట్ మోనిటర్, స్ట్రెస్ మోనిటర్, స్లీప్ మోనిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Also Read: మూడు గ్రూపులుగా ఎస్సీలు.. ఏ కులం ఏ గ్రూపులో ఉందో తెలుసా?.. ఫుల్ లిస్ట్ ఇదే!
Noise Icon Buzz
ఫ్లిప్‌కార్ట్‌లో మరో స్మార్ట్‌వాచ్ తక్కువ ధరకు లభిస్తుంది. నాయిస్ ఐకాన్ బజ్ వాచ్ ధర రూ.4,999 కాగా ఇప్పుడు కేవలం 80 శాతం డిస్కౌంట్‌తో రూ.999లకే సొంతం చేసుకోవచ్చు. దీనిని కూడా పలు బ్యాంక్ అండ్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత తక్కువకు కొనుక్కోవచ్చు. అలాగే ఈ వాచ్‌లో సైతం అధునాతన టెక్నాలజీతో కూడా ఫీచర్లు ఉన్నాయి.
Follow Us