/rtv/media/media_files/2025/05/18/Msg5zJuBcdLbvp9yHdYW.jpg)
Telangana Government increases liquor prices
BIG BREAKING: మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే KF బీర్ల ధరలు భారీగా పెంచగా తాజాగా లిక్కర్ ధరలు కూడా పెంచుతున్నట్లు ఎక్సైజ్ శాఖ సర్క్యూలర్ జారీ చేసింది. క్వార్టర్‌పై రూ.10, హాఫ్‌పై రూ.20, ఫుల్ బాటిల్ పై రూ.40 పెంచుతున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రంలో మద్యం ధరలు పెంపు
— Telangana Awaaz (@telanganaawaaz) May 18, 2025
చీప్ లిక్కర్ మినహా అన్నింటిపై ధరల మోత
180 ml కి.10 రూపాయలు
ఆఫ్ కి..20 రూపాయలు
ఫుల్ కి 40 రూపాయలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం
పెరిగిన ధరలు రేపటి నుంచి అమలు
ఇప్పటికే పెరిగిన బీర్ ధరలు..@TSExcise pic.twitter.com/nUaCkBRGq9
Also Read: గుల్జారీ హౌజ్ అగ్ని ప్రమాదం.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
మరోవైపు మందుబాబులకు కిక్కు ఇచ్చే గుడ్ న్యూస్ వెలువడింది. భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో బీర్ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఒక్కో బ్రాండ్ రూ.20 నుంచి రూ.35 వరకు తగ్గనుంది. అయితే ఈ తగ్గింపు కొన్ని బ్రాండ్లకే పరిమితం కానున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. భారత్, బ్రిటన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో బ్రిటన్ బీర్‌పై పన్ను ఏకంగా 75 శాతం తగ్గింది. దీంతో ఒక్కో యూకే బీర్ పై దాదాపు 35 రూపాయలు తగ్గనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రూ.200 ఉన్న బ్రిటన్ బీర్ ఇకపై రూ.165 లేదా రూ.175 కే లభించనుంది. ఇక 2024 లో భారతీయ బీర్ మార్కెట్ విలువ రూ.50వేల కోట్లు ఉండగా.. ప్రతి సంవత్సరం సగటున 8-10శాతం వృద్ధి రేటును కలిగివున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: రాకెట్ ప్రయోగం ఫెయిలయితే.. ఉపగ్రహాల శకలాలు ఎక్కడ పడతాయో తెలుసా ?