Swiggy- Zomato: త్వరలో స్విగ్గీ, జొమాటాలో కొత్త సేవలు

స్విగ్గీలో ఇకపై లాయర్లు, థెరపిస్టులు, ఫిట్‌నెస్ ట్రైనర్లు, జ్యోతిష్యులు, డైటీషియన్ల సేవలను తీసుకురావాలని కంపెనీ ప్రయత్నిస్తోంది. తాజాగా ఫుడ్ రెస్క్యూ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన జొమాటో వాట్సాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకునే అవకాశం తీసుకురావాలని భావిస్తోంది.

New Update
Telangana:  టైమ్ రిస్ట్రిక్షన్ పెట్టకండి..స్విగ్గీ, జొమాటో వర్కర్స్ అసోసియేషన్

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు అయిన స్వీగ్గీ, జొమాటాలు కొత్త సేవలను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల స్విగ్గీ సంస్థ ఐపీఓలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు యెల్లో పేరుతో మరికొన్ని కొత్త సేవలను తీసుకురావాలని చూస్తోంది. ఇప్పటి వరకు స్విగ్గీ ఫుడ్ మాత్రమే డెలివరీ చేసేది.

ఇది కూడా చూడండి: AP Budget 2024: ఏపీ బడ్జెట్లో అత్యధిక నిధులు బీసీలకే.. ఎన్ని వేల కోట్లో తెలుసా?

ఫుడ్ మాత్రమే డెలివరీ కాకుండా..

ఇకపై లాయర్లు, థెరపిస్టులు, ఫిట్‌నెస్ ట్రైనర్లు, జ్యోతిష్యులు, డైటీషియన్‌ల వంటి నిపుణుల సేవలను కూడా యాప్ ద్వారా తీసుకురావాలని చూస్తోంది. అయితే ఈ సేవలకు ప్రత్యేకంగా మరోక యాప్‌ను లాంఛ్ చేస్తుందా? లేకపోతే స్విగ్గీ యాప్‌ ద్వారానే సేవలు ఉంటాయా? అనే విషయం క్లారిటీ లేదు. అలాగే ప్రీమియం కస్టమర్ల కోసం రేర్‌ పేరుతో ఫార్ములా 1 రేస్‌, మ్యూజిక్‌ కాన్సర్ట్‌, ఆర్ట్‌ ఎగ్జిబిషన్లకు ప్రవేశం కల్పించాలని కూడా స్విగ్గీ భావిస్తోంది. 

ఇది కూడా చూడండి: TGఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపికలో గందరగోళం...విధుల నుంచి మరో యువతి తొలగింపు!

ఇదిలా ఉండగా.. జొమాటో కూడా వాట్సప్‌ ద్వారా ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకొనే అవకాశం కస్టమర్లకు తీసుకురావాలని భావిస్తోంది. అలాగే క్విక్‌ కామర్స్‌ బ్లింకిట్‌ ద్వారా ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్‌ సేవలను కూడా యూజర్లకు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. 

ఇది కూడా చూడండి: BREAKING: RGVకి చంద్రబాబు సర్కార్ షాక్.. ఏపీలో కేసు!

ఇటీవల జొమాటో ఫుడ్ రెస్క్యూ అనే ఒక కొత్త ఫీచర్‌ను కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎవరైనా వినియోగదారులు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే.. సమీపంలోని కస్టమర్లు డిస్కౌంట్‌కు కొనుగోలు చేయవచ్చని జొమాటో తెలిపింది. దీనివల్ల ఫుడ్ కాస్త తక్కువ ధరకి రావడంతోపాటు ఆర్డర్‌ను తొందరగా తీసుకోవచ్చు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ జొమాటో ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇది కూడా చూడండి: Trump: పుతిన్‌కు ఫోన్ చేసిన ట్రంప్.. !

Advertisment
Advertisment
తాజా కథనాలు