Donald Trump: పుతిన్‌కు ఫోన్ చేసిన ట్రంప్.. !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల్లో గెలిచిన తరువాత ఇతర దేశాల అధినేతలకు ఫోన్‌ చేసి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కి ఫోన్‌ చేసి మాట్లాడారు.

New Update
putin

Russia-Ukraine War:

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని పెంచడానికి వీలు లేదని ట్రంప్ సూచించినట్టు సమాచారం. ఎన్నికల్లో విజయం సాధించిన రెండు రోజుల తర్వాత ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో ఎస్టేట్ నుంచి పుతిన్‌కు గురువారం ఫోన్ చేశారని నివేదికలు తెలిపాయి. 

Also Read:  TTD: అధికారుల నిర్ణయానికి నో చెప్పిన టీటీడీ  ఛైర్మన్

దీనిపై ట్రంప్ ప్రతినిధులను సంప్రదించగా.. వారు స్పందించడానికి నిరాకరించినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ చెప్పింది. పుతిన్‌తో కాల్‌లో మాట్లాడిన ట్రంప్.. ఐరోపాలో అమెరికా గణనీయమైన సైనిక ఉనికిని గుర్తు చేశారని ఆ సమయంలో అక్కడ ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ నివేదించింది. ‘త్వరలో ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారం గురించి చర్చించడానికి తదుపరి సంభాషణలపై కూడా ఆసక్తి వ్యక్తం చేసినట్లు వారు ప్రకటించారు.

Also Read:  పెళ్లింట విషాదం నింపిన ప్రమాదం..వధువు అన్న,స్నేహితురాలి దుర్మరణం

ట్రంప్ ఎన్నిక దాదాపు మూడేళ్లుగా సాగుతోన్న ఉక్రెయిన్ సంఘర్షణకు ముగింపు పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో యుద్ధాన్ని త్వరగా ముగించాలని, కీవ్‌కు అమెరికా బిలియన్ డాలర్ల మద్దతుపై సందేహాన్ని వ్యక్తం చేశాడు. మరోవైపు, ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు  జెలెన్‌స్కీ కూడా ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య యుద్ధం గురించి కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. 

Also Read:  TGఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపికలో గందరగోళం...విధుల నుంచి మరో యువతి తొలగింపు!

టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సైతం ఈ సంభాషణ మధ్యలోకి వచ్చినట్లు సమాచారం. ట్రంప్‌తో సంభాషణ అద్బుతంగా సాగిందని జెలెన్‌స్కీ అభివర్ణించారు. చర్చలు కొనసాగించడానికి, మా సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ట్రంప్ అంగీకరించారని చెప్పారు.కాగా, జనవరి 20న ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు ఉక్రెయిన్‌కు వీలైనంత ఎక్కువ సహాయాన్ని పంపుతామని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం ధ్రువీకరించింది. 

Also Read:  Srisailam: శ్రీశైలం ఆలయంలో డ్రోన్‌ కలకలం..అదుపులో ఇద్దరు వ్యక్తులు

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలేవన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘యుద్ధ క్షేత్రంలో ఉక్రెయిన్‌ను వీలైనంత బలంగా నిలబెట్టడమే వైట్‌హౌస్ లక్ష్యమని చెప్పింది. అంతిమంగా చర్చల్లో అది సాధ్యమైనంత బలమైన స్థానంలో ఉంటుందన్నారు. ఉక్రెయిన్‌కు కేటాయించిన 6 బిలియన్ల డాలర్ల మిగులు నిధులు ఉన్నాయని సుల్లివన్ చెప్పారు.

అటు, రష్యా ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తున్నా.. ట్రంప్ గెలుపుతో సానుకూలంగా ఉంది. ఇదే అంశంపై క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఆదివారం మాట్లాడుతూ,.. ‘సంకేతాలు సానుకూలంగా ఉన్నాయి... కనీసం అతను శాంతి గురించి మాట్లాడుతున్నాడు.. ఘర్షణ గురించి కాదు’ అని అన్నారు. తన ప్రచార సమయంలో ట్రంప్ పదేపదే ఉక్రెయిన్ యుద్ధాన్ని త్వరగా ముగించాలని చెప్పిన విషయం తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు