Business: ఒక్కసారిగా సెన్సెక్స్ 1100 పాయింట్లు జంప్.. లాభాల్లో సూచీలు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎట్టకేలకు ఈరోజు లాభాల బాట ఎక్కింది. నిన్న అత్యంత కనిష్టానికి దిగజారిన సూచీలు ఈరోజు ఒక్కసారిగా హైజంప్ చేసి పైకొచ్చేశాయి. సెన్సెక్స్ 694, నిఫ్టీ 217 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. By Manogna alamuru 05 Nov 2024 | నవీకరించబడింది పై 05 Nov 2024 17:57 IST in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Stock Market: ఎప్పటిలానే ఉదయం నష్టాలతోనే ట్రేడింగ్ మొదలైంది. కానీ మధ్యాహ్నం అయ్యేసరికి పరిస్థితి మారిపోయింది. సూచీలు లాభాలవైపు మొగ్గు చూపాయి. చివర వరకు అవే కొనసాగించాయి కూడా. సెన్సెక్స్ రోజు కనిష్ట స్థాయి 78,296 నుంచి 1,180 పాయింట్లు కోలుకుంది. రోజు ట్రేడింగ్ ముగిసేసరికి 694 పాయింట్ల లాభంతో 79,476 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా రోజు కనిష్ట స్థాయి 23,842 నుంచి 371 పాయింట్లు కోలుకుంది. 217 పాయింట్ల లాభంతో 24,213 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 21 పెరగ్గా, 9 క్షీణించాయి. 50 నిఫ్టీ స్టాక్స్‌లో 39 లాభపడగా, 11 నష్టపోయాయి. NSE లోని మెటల్ సెక్టార్ అత్యధికంగా 2.84% పెరిగింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మరియు ఎస్‌బిఐ మార్కెట్‌ను ముందుకు తీసుకెళ్లాయి. అయితే ఐటీసీ, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్‌ను కిందకు లాగాయి. ఇది కూడా చదవండి: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ .. పరీక్ష ఫీజు పై కీలక ప్రకటన ఆసియా మార్కెట్‌లో జపాన్‌కు చెందిన నిక్కీ 1.11 శాతం లాభపడింది. కొరియాకు చెందిన కోస్పి 0.47% క్షీణించగా, చైనా యొక్క షాంఘై కాంపోజిట్ 2.32% పెరుగుదలతో ముగిసింది. NSE డేటా ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) నవంబర్ 4న ₹4,329.79 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ కాలంలో, దేశీయ పెట్టుబడిదారులు (DIIలు) ₹ 2,936.08 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అమెరికా ఎన్నికలు కూడా మార్కెట్ దూసుకుపోవడానికి సహకరించాయి అంటున్నారు నిపుణులు. మదుపరులు ఎన్నికల మీద దృష్టి పెట్టారని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: బతకాలంటే బహిరంగ క్షమాపణ.. లేదంటే రూ.5 కోట్లు.. సల్మాన్‌కు వార్నింగ్ ఇది కూడా చదవండి: US Election 2024: అమెరికా ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలివే! #stock-market #sensex-today #nifty మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి