తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ .. పరీక్ష ఫీజు పై కీలక ప్రకటన

తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు తేదీలను విడుదల చేసింది. 2025 ఇంటర్మీడియట్‌ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ఫస్ట్,సెకండ్ ఇయర్ రెగ్యులర్ విద్యార్థులు, అలాగే బ్యాక్ లాగ్ విద్యార్థులు ఈనెల 06.11.2024 నుంచి 26.11.2024 వరకు ఫీజు చెల్లించవచ్చు.

New Update
inter board

inter board

Telangana inter board: తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్ కీలక ప్రకటన విడుదల చేసింది.  2025 మార్చిలో జరగబోయే ఇంటర్ పరీక్షల ఫీజు గడువు  తేదీలను ప్రకటించింది. ఫస్ట్ & సెకండ్ ఇయర్ రెగ్యులర్ విద్యార్థులు, బ్యాక్ లాగ్ విద్యార్థులు((జనరల్, వొకేషనల్), అలాగే ఆర్ట్స్/హ్యూమానిటీస్ గ్రూప్‌లకు హాజరు మినహాయింపు పొందిన ప్రైవేట్ అభ్యర్థులు ఈనెల 06.11.2024 నుంచి 26.11.2024 వరకు ఫీజును  చెల్లించే అవకాశం కల్పించింది. 

Also Read: చిరు, నాగ్, వెంకీలో నాకు ఇష్టమైన హీరో అతనే.. బాలయ్య భలే చెప్పాడుగా!

ఫీజు చెల్లింపు తేదీలు   

  • ఫీజు చెల్లించడానికి ప్రారంభ తేదీ: 06.11.2024
  •  ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 26.11.2024
  • ఆలస్య రుసుము రూ.100/ తో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 27.11.2024 నుంచి 04.12.2024
  • ఆలస్య రుసుము రూ.500/ తో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 05.12.2024 నుంచి 11.12.2024
  • ఆలస్య రుసుము రూ.1000/ తో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 12.12.2024 నుంచి 18.12.2024

కోర్సు ఫీజు వివరాలు ఇక్కడ చూడండి 

  • 1st ఇయర్ జనరల్ రెగ్యులర్: రూ.520/-
  • 1st ఇయర్ ఒకేషనల్ రెగ్యులర్ (థియరీ 520+ ప్రాక్టికల్స్ 230)
    రూ.750/-
  • 2nd ఇయర్ జనరల్ ఆర్ట్స్:  రూ.520/-
  • 2nd ఇయర్ ఒకేషనల్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) రూ.750/-

పూర్తి వివరాలు కోసం ఇంటర్ బోర్డు వెబ్సైట్ ను వీక్షించండి. 

inter board

Also Read: వరుణ్, లావణ్య మొదటి పెళ్లిరోజుకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్!.. వీడియో వైరల్

Also Read: హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. VD12 షూటింగ్ లో అలా..!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు