బతకాలంటే బహిరంగ క్షమాపణ.. లేదంటే రూ.5 కోట్లు.. సల్మాన్‌కు వార్నింగ్

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ మరో వార్నింగ్ ఇచ్చింది. 'నీవు బతికి ఉండాలంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదా రూ.5 కోట్లు ఇవ్వాలి. లేదంటే లేపేస్తాం. మా గ్యాంగ్‌ యాక్టివ్ గా ఉంది' అని మెసేజ్ పంపినట్లు ముంబై పోలీసులు తెలిపారు. 

author-image
By srinivas
New Update
Salman Khan

Bishnoi Gang: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ మరో వార్నింగ్ ఇచ్చింది. సల్మాన్ బతకాలంటే ఈ రెండు షరతుల్లో ఒకదానిని అంగీకరించాలంటూ దుండగులు అప్షన్స్ ఇస్తూ మెసేజ్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆమె వీడియో చూడగానే ఏడ్చేసిన సూర్య.. ప్రోమో వైరల్

అలా జరగకపోతే చంపేస్తాం..

 ఈ మేరకు ముంబై ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌ వాట్సప్‌ నంబరుకు సోమవారం అర్ధరాత్రి మెసేజ్‌ వచ్చినట్లు వెల్లడిస్తూ.. ‘నేను లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడిని. సల్మాన్‌ఖాన్‌ బతికి ఉండాలంటే బహిరం క్షమాపణలు చెప్పాలి. లేదంటే రూ.5 కోట్లు ఇవ్వాలి. అలా జరగకపోతే తప్పకుండా చంపేస్తాం. మా గ్యాంగ్‌ చాలా యాక్టివ్ గా ఉంది' అంటూ మెసేజ్ పంపినట్లు చెప్పారు. అయితే దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టినట్లు తెలిపిన పోలీసులు.. అక్టోబరు 30న కూడా సల్మాన్‌ఖాన్‌ను బెదిరిస్తూ రూ. 2 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: Imane Khelif: ఆమె కాదు అతడే.. స్వర్ణ పతకం వెనక్కి తీసుకోండి: హర్భజన్‌

భద్రత మరింత పెంచిన ప్రభుత్వం.. 

ఇదిలావుంటే.. ఇటీవలే లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో శత్రుత్వాన్ని ముగించుకోవాలంటే ఆయన రూ.5 కోట్లు చెల్లించాలని, లేదంటే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణంగా చంపుతామని దుండగులు మెసేజ్‌ పంపినట్లు చెప్పారు. ఇక 2024 ఏప్రిల్‌లో సల్మాన్‌ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ కు భద్రతను పెంచింది.

ఇది కూడా చదవండి: US Election 2024: అమెరికా ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలివే!

Advertisment
తాజా కథనాలు