US Election 2024: అమెరికా ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలివే! అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల ప్రచారం ముగిసింది. పలు రాష్ట్రాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ తమ ఫైనల్ సర్వేలను వెల్లడించాయి. మేజర్ సర్వేలు కమల హారీస్ అనుహ్యంగా పుంజుకున్నట్లు తెలిపాయి. By srinivas 05 Nov 2024 | నవీకరించబడింది పై 05 Nov 2024 16:24 IST in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి US Election: అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో న్యూహాంప్‌షైర్ తోపాటు పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ తమ ఫైనల్ సర్వేలను వెల్లడించాయి. మొదటినుంచి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నట్లు చెప్పినప్పటికీ.. అన్యూహ్యంగా పోలింగ్ కు ఒక రోజు ముందు కమలా హారీస్ ముందంజలో ఉండబోతున్నట్లు అంచనాలు వెల్లడించాయి. చివరిరోజు పుంజుకున్న హారీస్.. ఈ మేరకు గురు నేట్ సిల్వర్‌కు చెందిన ‘ఫైవ్ థర్టీ ఎయిట్’ సర్వే నిన్నటివరకు ట్రంప్ ఆధిక్యంలో ఉన్న ప్రాంతాల్లో చివరిరోజు కమల హరీస్ పుంజుకున్నట్లు తెలిపింది. స్వింగ్ స్టేట్స్ మాత్రం ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోందని, కచ్చితమైన రిజల్ట్స్ అంచనా వేయలేకపోతున్నట్లు వెల్లడించింది. దిహారిస్ ఎక్స్-ఫోర్బ్స్ సర్వే కమల హరీస్ ముందంజలో ఉన్నట్లు తెలిపింది. హరీస్ కు 49శాతం మంది పట్టం కట్టగా ట్రంప్‌నకు 48 శాతం మంది మద్దతు పలుకుతున్నట్లు పేర్కొంది. అలాగే ఎన్‌బీఎస్ న్యూస్ తుది పోల్స్.. డెమోక్రట్లు, రిపబ్లికన్ల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని తెలిపింది. పార్టీ నేతలు, అబార్షన్ చట్టాలు హారీస్ కు బలంగా ఉన్నాయని, ఆర్థికవ్యవస్థ, ధరలు ట్రంప్‌నకు అనుకూలంగా ఉన్నట్లు అంచనా వేసింది. ఇది కూడా చదవండి: Olympics: 2036 ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యం.. IOCకి IOA అధికారిక లెటర్! కమల 51శాతం ఓట్లు.. యాహూ న్యూస్-యూగవ్.. ఇద్దరికీ 47శాతం ఓట్లు లభిస్తాయని తెలిపింది. పీబీఎస్ న్యూస్-ఎన్‌పీఆర్-మారిస్ట్ సర్వే హారిస్‌కే ఆధిక్యం ఉన్నట్లు వెల్లడించింది. కమల 51శాతం ఓట్లతో ముందంజలో ఉండగా ట్రంప్‌నకు 47 శాతం వస్తాయని తెలిపింది. మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం.. హారీస్ కు 49శాతం, ట్రంప్ కు 46 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. ఎకానమిస్ట్-యూగవ్ నిర్వహించిన సర్వే హారిస్‌కు 3శాతం ఆధిక్యం ఉంటుందని అంచాన వేసింది. కమలకు 49శాతం, ట్రంప్‌కు 47 శాతం మద్దతు ఉన్నట్లు పేర్కొంది. ఇక సర్వేల ఆధారంగా కమల హరీస్ గెలిచే అవకాశం 50.015 శాతం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్‌కు 49.985 శాతం ఓట్లు పడే ఛాన్స్ ఉందని, ఏది ఏమైనా ఉత్కంఠ తప్పదని అంటున్నారు. ఇది కూడా చదవండి: పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం ఇది కూడా చదవండి: పోలీసులు మెత్తబడ్డారు.. ఇది జగన్ సర్కార్ కాదు.. పవన్ సంచలన వ్యాఖ్యలు #america-election-2024 #kamala-haaris #donald-trump మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి