/rtv/media/media_files/2025/04/22/8MLy0IWUmwC4FqjjuAQ5.jpg)
Stock Market Today
అంతర్జాతీయంగా మిశ్ర సంకేతాలు ఒకవైపు , ఆర్బీఐ ప్రకటన ముందు మరోవైపు తో ఈరోజు దేశీ స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్ గా ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ బాగానే నడుస్తున్నా నిఫ్టీ మాత్రం కిందకూ మీదకూ అవుతోంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఆర్బీఐ రెపో రేట్లను ప్రకటించింది. ఇప్పుడు ఆ ప్రభావంతో మార్కెట్ వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఉదయం 9.30 గంటలకు మాత్రం సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి 80,800 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 10 పాయింట్లు పెరిగి 24,650 దగ్గర ఫ్లాట్ గా ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసలు పెరిగి 87.72గా కొనసాగుతోంది.
అటూ ఇటుగా..
సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 20 లాభపడగా, 10 నష్టపోయాయి. అదానీ పోర్ట్స్, ఎయిర్‌టెల్, బిఇఎల్ స్టాక్‌లు దాదాపు 2% లాభపడ్డాయి. సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ లు కూడా 1% లాభపడ్డాయి. ఇక నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 30 లాభాలతో, 19 నష్టాలతో ట్రేడవుతున్నాయి. NSE ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు పడిపోయాయి. మీడియా, బ్యాంకింగ్ స్టాక్‌లు లాభాలతో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఆసియా మార్కెట్లలో, జపాన్ నిక్కీ 0.62% పెరిగి 40,802 దగ్గర, కొరియా కోస్పి 0.20% తగ్గి 3,192 దగ్గర ట్రేడవుతున్నాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.29% పెరిగి 24,974 వద్ద ఉండగా, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.27% పెరిగి 3,628 వద్ద ముగిసింది. మరోవైపు
ఆగస్టు 5న, US డౌ జోన్స్ 0.14% తగ్గి 44,111 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ మాత్ర 0.65% తగ్గి 20,916 వద్ద, S&P 500 0.49% పెరిగి 6,299 వద్ద ముగిశాయి.
వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్..
మరోవైపు ఆర్బీఐ కొద్దిసేపటి క్రితమే వడ్డీ రేట్ల గురించి ప్రకటన చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటికే ట్రిపుల్ బొనాంజా అందించిన ఆర్బీఐ ఈ సారి మాత్రం ఏ మార్పులూ లేవని తేల్చి చెప్పేసింది. వడ్డీ రేట్లను 5.5 శాతం దగ్గరే యధాతథంగా ఉంచేసింది. ద్రవ్యోల్బణం అంచనాలకు మించి తగ్గినప్పటికీ.. అమెరికా టారిఫ్‌లపై అనిశ్చితులు ఇంకా తొలగలేదని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు.
#WATCH | Monetary Policy Committee decides to keep the policy repo rate unchanged at 5.5%, neutral stance to continue, says RBI Governor Sanjay Malhotra.
— ANI (@ANI) August 6, 2025
(Video source: RBI/YouTube) pic.twitter.com/dZLo5WjFKj
Also Read: Bangladesh: ఇండియా మా ఫ్రెండే.. మీరే దొబ్బేయండి.. చైనా, పాక్ కు బంగ్లాదేశ్ బిగ్ షాక్!