/rtv/media/media_files/2025/01/25/duj37LPUdyW3HlpnzCHm.jpg)
Starbucks CEO Brian Nicole Photograph: (Starbucks CEO Brian Nicole)
స్ట్రార్‌బక్స్ ప్రముఖ కాఫీ కేఫ్. ఇందులో ఓ నార్మల్ కాఫీ తాగాలంటే వేలల్లో బిల్లు చెల్లించాలి. అయితే ఆ కంపెనీ సీఈఓ రికార్డ్ స్థాయిలో వేతనం తీసుకుంటూ వార్తల్లో నిలిచారు. స్టార్‌బక్స్ సీఈఓ బ్రియాన్ నికోల్ యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్‌కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ల కంటే ఎక్కువ సాలరీ తీసుకుంటున్నాడు. 2024 సెప్టెంబర్‌లో నికోల్ స్టార్‌బక్స్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ నాలుగు నెలలు ఆయన జీతం రూ.827 కోట్లు. కంపెనీలో చేరిన నెల తర్వాత నికోల్ 5 మిలియన్ డాలర్ల సైన్ ఆన్ బోనస్ కూడా పొందారు నికోల్.
Read also : టీడీఎస్ రద్దుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
అమెరికాలో అత్యధిక వేతనాలు అందుకుంటున్న టాప్ 20 కంపెనీల సీఈఓల్లో బ్రియాన్ నికోల్ ఒకరుగా నిలిచారు. నికోల్ కంటే ముందు స్టార్‌బక్స్ సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఉండేవారు. స్టార్‌బక్స్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీంతో కంపెనీ సీఈఓని మార్చి నికోల్ కు బాధ్యతలు అప్పగించింది. ఇతనికి భారీగా వేతనం చెల్లిస్తోంది స్టార్‌బక్స్.
ఇది కూడా చదవండి: నీయవ్వ తగ్గేదేలే.. జాన్వీ కపూర్‌కు దేవిశ్రీ ప్రసాద్ బంపరాఫర్!
ఈ లెక్కన నికోల్ నెలకు రూ.206 కోట్లు, రోజుకు రూ.6 కోట్లు సాలరీ తీసుకుంటున్నాడు. యానివల్ ప్యాకేజీ 113 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.. ఇవే కాకుండా కంపెనీ ఆయన వ్యక్తిగత ఖర్చులను అలవెల్స్ ల రూపంలో భరిస్తోంది. దాదాపు ఆయన జీతం అంతా 94 శాతం స్టాక్ అవార్డుల రూపంలో తీసుకుంటున్నట్లు బ్లూమ్‌బర్గ్ తన నివేదకలో పేర్కొంది.
Follow Us