Stock Market: వారం చివరి రోజున లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్

ఐదు రోజలుగా ఎరుపెక్కిన భారత్ స్టాక్ మార్కెట్ వారంలో చివరి రోజైన శుక్రవారం నాడు కాస్త చల్లబడింది. ఉదయం ప్రారంభం నుంచే లాభాల బాటలో పయనిస్తోంది. సెన్సెక్స్ 150 పాయింట్లు పెరిగి 80,200 స్థాయిలో ట్రేడవుతండగా.. నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 24,550 స్థాయిలో ఉంది. 

New Update
business

Stock Market Today

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారీఫ్ లతో గందరగోళంగా మారిన భారత స్టాక్ మార్కెట్ దాదాపు ఐదు రోజుల తర్వాత ఈరోజు కాస్త సానుకూలంగా కనిపిస్తోంది. ఉదయం ప్రారంభ సమయం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల బాటలో పరుగులు పెడుతున్నాయి.. వారంలోని చివరి ట్రేడింగ్ రోజు అంటే శుక్రవారం.. ఆగస్టు 29న, సెన్సెక్స్ 150 పాయింట్లు పెరిగి 80,200 స్థాయిలో ట్రేడవుతండగా.. నిఫ్టీ దాదాపు 50 పాయింట్లు పెరిగి 24,550 స్థాయిలో ఉంది. 

30 సెన్సెక్స్ స్టాక్స్‌లో  22 లాభపడగా, 8 నష్టపోయాయి. కోటక్ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌యూఎల్ షేర్లు లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 2% వరకు తగ్గాయి. మరోవైపు నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 31 స్టాక్‌లు లాభపడగా, 19 స్టాక్‌లు నష్టపోతున్నాయి. NSE FMCG ఇండెక్స్ అత్యధికంగా 1.22% లాభపడింది. బ్యాంకింగ్, మీడియా మరియు మెటల్ కూడా లాభపడ్డాయి. ఆటో, ఐటీ, రియాల్టీ నష్టపోయాయి.

మిశ్రమంగా అంతర్జాతీయ మార్కెట్లు...

ప్రపంచ మార్కెట్లు కూడా మిశ్రమంగా నడుస్తున్నాయి. ఆసియా మార్కెట్లలో, జపాన్ నిక్కీ 0.43% తగ్గి 42,642 వద్ద, కొరియా కోస్పి 0.15% తగ్గి 3,191 వద్ద ట్రేడవుతున్నాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.74% పెరిగి 25,183 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.15% పెరిగి 3,849 వద్ద ముగిసింది. మరోవైపు ఆగస్టు 28న, యూఎస్ డౌ జోన్స్ 0.16% పెరిగి 45,637 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.53% మరియు S&P 500 0.32% పెరిగాయి. ఇక నిన్న విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) నగదు విభాగంలో రూ.3,856.51 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అదే సమయంలో, దేశీయ పెట్టుబడిదారులు (DIIలు) రూ.6,920.34 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు.

Also Read: Vizianagaram Terror Case: విజయనగరం ఉగ్ర కుట్ర ...కీలక నిందితుడిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

Advertisment
తాజా కథనాలు