Jio IPO: త్వరలో రాబోతున్న జియో ఐపీఓ.. ఎప్పుడంటే?

అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో తన మొదటి ఐపీఓను వచ్చే ఏడాది ప్రారంభించనుంది. మార్కెట్‌లోకి రూ.8.40లక్షల కోట్ల విలువతో అడుగుపెట్టేందుకు జియో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Reliance JIO : మరో సంచలనానికి తెరలేపుతున్న రిలయన్స్..అందరి ఫోకస్ 5జీ ఫోన్ల మీదే..!!
New Update

ఇప్పటికే పలు కంపెనీలు ఐపీఓలోకి వచ్చాయి. మార్కెట్‌లోకి ఇటీవల హ్యుందాయ్ ఐపీఓలు ఎంట్రీ ఇవ్వగా.. త్వరలో జియో ఐపీఓ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. దేశంలో టెలికాం వినియోగదారుల సంఖ్య ఎక్కువగా ఉన్న రిలయన్స్ జియో తన మొదటి ఐపీఓ వచ్చే ఏడాది జరగనున్నట్లు తెలుస్తోంది. జియో తర్వాతే రిలయన్స్ రిటైల్ ఐపీఓ జరుగతుందని సమాచారం. మార్కెట్‌లోకి రూ.8.40లక్షల కోట్ల విలువతో అడుగుపెట్టేందుకు జియో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: జగన్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఆ ఇద్దరు కీలక నేతలు జంప్!

గతంలో ఒకసారి ప్రస్తావన..

జియో ఐపీఓ కోసం రిలయన్స్ అధికారికంగా ఎలాంటి తేదీలను ప్రకటించలేదు. అయితే గతంలో 2019లో ఒకసారి రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ ఐదేళ్లలో పబ్లిక్‌కు వెళ్లాలని భావిస్తున్నామని, వాటిని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖేష్ అంబానీ తెలిపారు. కానీ ఇప్పటి వరకు మళ్లీ దాని గురించి ఎలాంటి ప్రకటన చేయాలేదు.

ఇది కూడా చదవండి: హోంమంత్రి అనితపై పవన్ సీరియస్.. ఇక ఊరుకోనంటూ..

జియో దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించింది. మొత్తం 479 మిలియన్ల సబ్‌స్కైబర్లతో పెద్ద టెలికాం సంస్థగా నిలిచింది. అయితే ఈ జియో ఐపీఓపై రిలయన్స్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ఇది కూడా చూడండి: USA: అమెరికా ఎన్నికలు...న్యూయార్క్ బ్యాలెట్ పేపర్లో బెంగాలీ

ఇదిలా ఉండగా అక్టోబర్ 15న హ్యుందాయ్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ మొదలైంది. ఇందులో 18 శాతం సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఒక్కో షేర్‌ను హ్యుందాయ్ రూ.1,865 నుంచి రూ.1,960గా నిర్ణయించింది. ఒక్క రోజుకే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి భారత్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్‌తో ఐపీఓకు రూ.8,315 కోట్లు సేకరించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓ కూడా నవంబర్ 6 నుంచి ప్రారంభం కాబోతుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఒక రోజు ముందే ఈ ఆఫర్ ప్రారంభం కానుంది.

ఇది కూడా చూడండి: అమెరికా ఎన్నికలు ఎలా జరుగుతాయి..బ్యాలెట్ పేపర్‌‌లో ఉండే అంశాలేంటి?

#mukesh-ambani #reliance-industries #jio #ipo
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe