హోంమంత్రి అనితపై పవన్ సీరియస్.. ఇక ఊరుకోనంటూ..

ఏపీలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని, గత ప్రభుత్వ తాలూకా సంస్కృతి ఇంకా కొనసాగుతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తాను హోంశాఖ తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని పోలీసు అధికారులను హెచ్చరించారు. నేరగాళ్లు కులం, మతం అంటే మడత పెట్టి కొట్టాలన్నారు. 

author-image
By srinivas
New Update

Pawan kalyan: ఏపీలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని, గత ప్రభుత్వ తాలూకా సంస్కృతి ఇంకా కొనసాగుతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. శాంతి భద్రతలు కీలకమైనవని, అత్యాచార ఘటనలకు హోంమంత్రి బాధ్యత వహించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం కాకినాడ జిల్లా పిఠాపురం పిఠాపురం సభలో శాంతిభద్రతలగురించి మాట్లాడిన ఆయన పోలీసు అధికారులు, ఎస్పీలకు పవన్‌ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

 

నేను దిగితే మరోలా ఉంటుంది.. 

ఈ మేరకు పవన్ మాట్లాడుతూ.. తాను హోంశాఖ తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. అత్యాచార నిందితులను అరెస్టు చేసేందుకు కులం అడ్డొస్తుందా? క్రిమినల్స్‌ను అరెస్టు చేయొద్దని ఏ చట్టం చెబుతోంది? క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదు. ఈ విషయం పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలి.  అధికారంలో ఉన్నాం కాబట్టే సంయమనంతో ఉంటున్నాం. పదేపదే మాతో చెప్పించుకోవద్దు. మేము ఎవరినీ వెనకేసుకు రావడం లేదు.. మీరు వెనకేసుకు రావొద్దు. మాది ప్రతీకార ప్రభుత్వం కాదు. అలాగని చేతులు ముడుచుకుని కూర్చొం. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టి భావప్రకటనా స్వేచ్ఛ అంటున్నారు. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రిగా నేను బాద్యతలు తీసుకుంటా. హోం మంత్రి అనిత రివ్యూ చేయాలి. లా అండ్ ఆర్డర్ చాలా కీలకం. పోలీసులు మరచిపోకండి. మా బంధువు అంటే మడత పెట్టి కొట్టండి. ఆడ పిల్లలు రేప్ చేస్తే కులం ఎందుకు వస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్ పోలీసులకు ఏమి చెబుతోంది తెలుసుకోవాలంటూ చురకలంటించారు. 

ఇది కూడా చదవండి: Ap-Aghori: ఏపీకి మకాం మార్చిన అఘోరీ.. ఆ ప్రముఖ ఆలయంలో రహస్య పూజలు!

ఎమ్మెల్యేలు బాధ్యతగా పనిచేయడం లేదు..

ఇక చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు చాలా బాధ కలిగిస్తున్నాయన్నారు. ఎమ్మెల్యేలు ఇసుక ఎంతకు వస్తుందో అడుగుతున్నారు తప్పితే.. బాధ్యతగా పనిచేయడం లేదన్నారు. హోమ్ మినిస్టర్ అనితకు ఇదే చెబుతున్నా.. రేప్ లు చేస్తున్న వారిని, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వాగుతున్న వారిని కంట్రోల్ చేస్తారా లేదా? ఏం చేయాలన్న దానిపై నేను వెయిట్ చేస్తున్నా. రాష్ట్రలో లా అండ్ ఆర్డర్ పై ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను హెచ్చరిస్తున్నా. గత తాలూకా అధికారులే కదా ఇప్పుడు పని చేస్తున్నది. అప్పుడు ప్రభుత్వంలో రేపిస్టులను గౌరవించారు. ఇప్పుడు అన్యాయం జరుగుతుంటే మరల అదే తీరు కొనసాగిస్తారా?  ఇక చూస్తూ ఊరుకోను. కూటమి విచ్చిన్నం చేయాలనుకున్న వారికి హెచ్చరిక. నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ అనే వ్యక్తులు కమిట్మెంట్ తో పని చేస్తున్నారు. వ్యక్తుల స్వార్థం కోసం పార్టీలపై నిందలు మోపి ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే కుదరదు. ఉచిత ఇసుక వ్యవహారంలో చంద్రబాబు సైతం ఎమ్మెల్యేలను హెచ్చరించారు. మట్టి తొవ్వుకుని అమ్ముకోవడాని పాల్పడే వారందరినీ హెచ్చరిస్తున్నా. పర్యావరణానికి విఘాతం కలిగితే సహించేది లేదంటూ తెగెసీ చెప్పారు పవన్. 

ఇది కూడా చదవండి: Live In Relationship: కామాంధుడి అరాచకం.. తల్లితో సహజీవనం.. కట్ చేస్తే కూతురితో..

 

Advertisment
Advertisment
తాజా కథనాలు