అమెరికా ఎన్నికలు ఎలా జరుగుతాయి..బ్యాలెట్ పేపర్‌‌లో ఉండే అంశాలేంటి?

 అమెరికా ఎన్నికల్లో ఇదే చివరి రోజు. ఈరోజుతో ఫైనల్ పోలింగ్ ముగుస్తుంది. రిజల్ట్‌ కూడా వెంటనే తెలిసిపోతుంది. అయితే అమెరికాలో ఎన్నికలను ఎలా నిర్వహిస్తారు? బ్యాలెట్ పేపర్లో ఏం ఉంటుందో తెలుసా..కింది ఆర్టికల్‌లో చదివేయండి...

New Update
22

USA Election Process:

అమెరికా ఎన్నికలు అంటే బయట ప్రపంచానికి నాలుగేళ్ళకు ఒకసారి జరిగినట్లు అనిపిస్తుంది. కానీ అమెరికాలో ఎన్నికలు ప్రతి రెండేళ్ళకూ జరుగుతాయి. కాకపోతే అధ్యక్ష్యుడి ఎన్నిక బ్యాలట్‌లో ఉన్నపుడే దానిని నేషనల్ ఎలక్షన్స్ కింద పరిగణింపబడుతోంది. అమెరికాలో లోయర్ హౌస్ లేదా ప్రతినిధుల సభలో ప్రతి సభ్యుడి పదవీకాలం రెండేళ్ళు మాత్రమే. అంటే లోయర్ హౌస్‌కు ఎన్నికయ్యే ప్రతి సభ్యుడూ రెండేళ్ళకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ఎన్నుకోబడినవారే ఉంటారు. ఇక అప్పర్ హౌస్ లేదా సెనేట్ లో ఉన్న ప్రతి సభ్యుడి పదవీకాలం మాత్రం ఆరేళ్ళు. అంటే ప్రతి రెండేళ్ళ ఎన్నికలో మూడవ వంతు సభ్యులు ఎన్నుకోబడతారు. అదే కోవలో అధ్యక్షుడి పదవీకాలం నాలుగేళ్ళు కాబట్టి రెండేళ్ళకోసారి వచ్చే ఎన్నికల్లో ప్రతి లీపు సంవత్సరం ఎన్నికల బ్యాలట్‌లో అధ్యక్ష్య పదవికి ఎన్నిక జరుగుతుంది.

మంగళవారమే పోలింగ్..

ఎన్నిక తేదీ ఎప్పుడు అనేది కూడా రాజ్యాంగం ప్రకారమే నిర్ణయిస్తారు. ఆరు నూరైనా ఆరోజే ఎన్నిక పూర్తవుతుంది. అదే నవంబర్లో వచ్చే మొదటి సోమవారం తర్వాతి మంగళవారం. పూర్వం వోటు వేయడానికి చాలా దూరం నుంచి కూడా బండ్లు కట్టుకొని వచ్చేవారుట. అలాగని ఆదివారం పెట్టడానికి వీలులేదు. ఎందుకంటే ఆరోజు అమెరికన్లకు...ఇక్కడా చాలా మంది క్రిస్టియన్లే కాబట్టి... ఆరోజు వారికి ప్రార్థనాదినం అవుతుంది. క్రైస్తవుల విశ్వాసాన్ని బట్టి విశ్రాంతిదినం కాబట్టి ఆరోజు ఏ ప్రయాణం వుండకూడదు కాబట్టి, సోమవారాన్ని ప్రయాణానికి కేటాయించి మంగళవారాన్ని ఎన్నికల రోజుగా నిర్ణయించారని తెలుస్తోంది.

ఎన్నిక నవంబర్ మొదటివరంలో జరిగినా గెలిచిన అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు అందుకునేది మాత్రం జనవరి 20, మధ్యాహ్నం 12గంటలకే. ఇప్పుడు ఎన్నికలు జరిగిన రోజే గెలిచింది ఎవరని ప్రకటించేస్తున్నారు గానీ పూర్వం అలా ప్రకటించడానికి పెద్ద తతంగం జరిగేది. నిజానికి టెక్నికల్‌గా ఆ తతంగం అంతా ఇప్పుడూ జరుగుతోంది. జనవరి ఆరున జరిగే రెండు చట్ట సభల ఉమ్మడి సమావేశల్లో చట్టబద్దంగా గెలిచిందెవరో ప్రకటిస్తారు.

బ్యాలెట్ పేపర్ ఎలా ఉంటుంది?

ఇండియా ఎన్నికల్లో అయితే ప్రతి అభ్యర్థికి ఓ గుర్తు వుంటుంది. వోటరు ఆ గుర్తు వున్న బటన్ ప్రెస్ చేస్తారు పోలింగ్ ప్రక్రియ అయిపోతుంది. కానీ అమెరికాలో అలా కాదు.  ఇక్కడ పోలింగ్ ప్రక్రియ అంతా పేపర్ ,ఎలెక్ట్రానిక్ మిశ్రమంగా ఉంటుంది. ఓటర్‌‌ కు ఇచ్చిన బ్యాలట్ పేపర్ మీద మనకు నచ్చిన అంశాలను ఎన్నుకున్నాక ఆ పేపర్‌ను అక్కడున్న మెషీన్‌కు ఫీడ్ చేస్తారు. అది మన వోటును నమోదు చేసుకొని మనకు చిన్న రిసీట్ ఇస్తుంది. అంతటితో వోటు వేయడం అయిపోతుంది. అయితే బ్యాలెట్ పేపర్ మీద చాలా అంశాలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చదివి ఓటును నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో నేషనల్ అంశాలు, రాష్ట్ర అంశాలు, స్థానిక అంశాలు కూడా వుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇష్టంలేని అంశం మీద చట్టం చేసివుంటే ప్రజలు ఆ చట్టానికి విరుద్దంగా ప్రజాభిప్రాయసేకరణ చేసి అటువంటి అంశాలను ప్రశ్నల రూపంలో బ్యాలట్‌లో ఉంచే అవకాశం ఉంటుంది. 

1

ఈసారి బ్యాలెట్ పేపర్లో అంశాలు..

ఈసారి ఎన్నికల్లో గర్భస్రావపు హక్కులు చాలా రాష్ట్రాల్లో ప్రధానాంశం కాబోతున్నాయి. ఇదివరకు గర్భస్రావానికి సంబందించి దేశమంతా ఒకే చట్టం అమల్లో వుండేది. కానీ దాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసి, గర్భస్రావపు హక్కులకు సంబంధించి ఏ రాష్ట్రం.. ఆ రాష్ట్రానికి సంబంధించి చట్టాలు చేసుకోవచ్చు అని చెప్పింది. దీన్ని అదనుగా చేసుకుని చాలా రిపబ్లికన్ రాష్ట్రాలు గర్భస్రావాన్ని నిషేధించాయి. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో అది ఒక ప్రశ్నగా ప్రజల ముందుకు వస్తోంది. దాని తరువాత అమెరికా ఆర్ధిక పరిస్థితి, వలసలు ఇలాంటివి కూడా బ్యలెట్ పేపర్లో కనబడే అవకాశం ఉంది. 

2

Also Read: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం...36మంది మృతి

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు