USA: అమెరికా ఎన్నికలు...న్యూయార్క్ బ్యాలెట్ పేపర్లో బెంగాలీ దాదాపు పదేళ్ళ తర్వాత అమెరికా ఎన్నికలు అయంత ఆసక్తిగా జరగుతుతున్నాయి. ప్రపంచదేశాల దృష్టి అంతా ఇప్పుడు ఇటువైపై ఉంది. ఇప్పటికే చాలా చోట్ల ముందస్తు ఓటింగ్ జరిగిపోయింది. అయితే న్యూయార్క్‌లో మొత్తం ఐదు భాషల్లో బ్యాలెట్ పేపర్ ఉండగా...ఇందులో బెంగాలీ ఒకటిగా ఉంది. By Manogna alamuru 05 Nov 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి New York Ballot Papers: అమెరికా ఎన్నికల్లో ఇప్పటికే 7.5 శాతం ఓటింగ్ జరిగిపోయింది. ఈమెయిల్స్ ద్వారా కొంతమంది..డైరెక్ట్‌గా పోలింగ్ స్టేషన్స్‌కు వెళ్ళి మరికొంత మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇంకా ఓటు వేయాల్సిన వాళళు కూడా చాలా మందే ఉన్నారు. ఈరోజు చివరి పోలింగ్ డే రోజున మొత్తం ఓటింగ్ నమోదు కానుంది. దీని తర్వాత ఫలితాలు కూడా ఆల్మోస్ట్ తెలిసిపోతాయి. అయితే ఈసారి ఎన్నికల ప్రక్రియలో...న్యూ యార్క్‌లో ఒక కొత్త విషయం చోటు చేసుకుంది. బ్యాలెట్ పేపర్లలో, పోలింగ్ ప్రక్రియలో భారతీయ భాష అయిన బెంగాలీకి చోటు కల్పించారు. ఎన్నికల ప్రక్రియలో ఇంగ్లిష్ కాకుండా మరో నాలుగు భాషలకు చోటు కల్పించాం. చైనీస్, స్పానిష్, కొరియన్, బెంగాలీ భాషల్లో బ్యాలెట్ అందుబాటులో ఉంది అని న్యూయార్క్ రాష్ట్ర ఎన్నికల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జే రియాన్ తెలిపారు. ఇక్కడ స్థిరపడిన వారికి ఇంగ్లిష్ తెలిసినప్పటికీ మాతృ భాషలో అందుబాటులో ఉంటే మరింత సౌకర్యంగా ఉంటుందన్ని ఆలోనతోనే ఇది చేశామని చెప్పారు. అయితే, భారత్‌లో అనేక భాషలున్నప్పటికీ గతంలో కోర్టులో వేసిన ఓ దావా వల్ల సారి ఎన్నికల ప్రక్రియలో కేవలం బెంగాలీకి మాత్రమే చోటు లభించిందని చెప్పారు. అమెరికాలో ప్రచార చట్టాలను మొత్తం ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ నిర్విస్తుంది. అయితే ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ లను మాత్రం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే చూసుకుంటాయి. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోలింగ్ సమయం, కౌంటింగ్ ప్రక్రియకు ఒక్కో రాష్ట్రం ఒక్కోలా ప్రత్యేక నిబంధనలను పాటిస్తాయి. Also Read:అమెరికా ఎన్నికలు ఎలా జరుగుతాయి..బ్యాలెట్ పేపర్‌లో ఉండే అంశాలేంటి? మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి