/rtv/media/media_files/2025/02/27/RTJomlb6reSU3OlbOnHV.jpg)
Realme Neo 7x Launched Photograph: (Realme Neo 7x Launched)
ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్ మీ తన లైనప్‌లో ఉన్న Neo 7x స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌తో పాటు Realme Neo 7 SEని కూడా పరిచయం చేసింది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్కమ్ కొత్త 4nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది 12GB వరకు RAM తో వస్తుంది. ఇప్పుడు దీని ధర, స్పెసిఫికేషన్ల వివరాల విషయానికొస్తే..
Realme Neo 7x Price
చైనాలో Realme Neo 7x ధర విషయానికొస్తే.. 8GB + 256GB వేరియంట్ CNY 1,299 (సుమారు రూ. 15,600) నుండి ప్రారంభమవుతుంది. 12GB + 512GB వేరియంట్ CNY 1,599 (సుమారు రూ. 19,200) ధరను కలిగి ఉంది. అయితే ఇది ప్రస్తుతం Realme చైనా ఇ-స్టోర్, ఇతర ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
ఇది కూడా చూడండి: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో
Realme Neo 7x Features
Realme Neo 7x స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2,000 nits వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. 6.67-అంగుళాల పూర్తి HD+ (1,080x2,400 పిక్సెల్స్) AMOLED స్క్రీన్‌తో వస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 SoCను కలిగి ఉంటుంది. ఇది Android 15-ఆధారిత Realme UI 6.0 తో నడుస్తుంది.
ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!
ఇక కెమెరా విషయానికొస్తే.. Realme Neo 7x వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ OV50D40 ప్రధాన సెన్సార్, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెన్సార్‌తో వస్తుంది. అలాగే Realme Neo 7x ఫోన్ 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు మరెన్నో ఫీచర్లతో ఇది వస్తుంది.