IPhone 17 Series Price In India: ఐఫోన్ 17 సిరీస్‌ సేల్ రెడీ.. బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు - ఇండియాలో ధర ఎంతంటే?

ఆపిల్ కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ 17 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు సెప్టెంబర్ 19 నుండి భారత మార్కెట్లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 12 నుండి మొదలయ్యాయి. వీటిని ఆపిల్ అధికారిక సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్‌లో కూడా కొనుక్కోవచ్చు.

New Update
IPhone 17 Series Price In India

IPhone 17 Series Price In India

అమెరికన్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఆపిల్ సెప్టెంబర్ 9న భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా iPhone 17 Seriesను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Maxతో పాటు కొత్త స్లిమ్ మోడల్ iPhone air కూడా ఉన్నాయి. ఈ ఐఫోన్‌లు సెప్టెంబర్ 19 నుండి అంటూ ఎల్లుండి నుంచి సేల్‌కు అందుబాటులోకి రానున్నాయి. అందువల్ల మీరు కొత్త ఐఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేసుకున్నట్లయితే.. బ్యాంక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI డీల్స్ వంటివి ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

iPhone 17 Seriesను ఎక్కడ కొనాలి?

iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max, iPhone air సెప్టెంబర్ 19 నుండి ఆపిల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు ఆపిల్ అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా ఐఫోన్ మోడళ్లను కొనుక్కోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ సైట్‌లు, విజయ్ సేల్స్ వంటి ఇతర రిటైల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఇవి సేల్‌కు అందుబాటులో ఉంటాయి.

iPhone 17 Series Bank Offers

ఆపిల్ తన లాంచ్ ఆఫర్‌లో భాగంగా iPhone 17 Seriesపై ఆరు నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్లను అందిస్తోంది. అలాగే బ్యాంక్ ఆఫర్లలో భాగంగా.. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ కార్డులపై రూ.5,000 వరకు డిస్కౌంట్లు పొందొచ్చు. అదనంగా కస్టమర్లు తమ పాత లేదా ఇప్పటికే ఉన్న ఫోన్‌లను రూ.64,000 వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. అయితే ఆఫర్ పూర్తి ప్రయోజనం పొందాలంటే.. పాత ఫోన్ కండీషన్ మెరుగ్గా ఉండాలి. డ్యామేజ్ ఉండకూడదు.

iPhone 17 Series India Price

iPhone 17 మొబైల్ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.82,900, 
512GB వేరియంట్ ధర రూ.1,02,900గా కంపెనీ నిర్ణయించింది. 

iPhone Air మొబైల్ 256GB వేరియంట్ ధర రూ.1,19,900.
512GB వేరియంట్ ధర రూ.1,39,900.
1TB వేరియంట్ ధర రూ.1,59,900గా కంపెనీ నిర్ణయించింది. 

iPhone 17 Pro మొబైల్ 256GB వేరియంట్ ధర రూ.1,34,900.
512GB వేరియంట్ రూ.1,54,900.
1TB వేరియంట్ ధర రూ.1,74,900గా ఉంది. 

iPhone 17 Pro Max మొబైల్ 256GB వేరియంట్ ధర రూ.1,49,900. 512GB వేరియంట్ ధర రూ.1,69,900.
1TB వేరియంట్ ధర రూ.1,89,900.
 2TB వేరియంట్ ధర రూ.2,29,900గా కంపెనీ నిర్ణయించింది. 

Advertisment
తాజా కథనాలు