Mobile Offers: రచ్చ రంబోలా.. మడత ఫోన్‌పై రూ.82వేల భారీ డిస్కౌంట్ - AMAZONలో అరాచకమైన ఆఫర్..!

అమెజాన్‌లో Samsung Galaxy Z Fold 6 5Gపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ అసలు ధర రూ.1,64,999 కాగా, ప్రస్తుతం రూ.40వేల తగ్గింపుతో రూ.1,24,999కే లిస్ట్ అయింది. అలాగే పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే మరో రూ.42,350 వరకు తగ్గింపు పొందవచ్చు.

New Update
Samsung Galaxy Z Fold 6 5G MOBILE OFFER

Samsung Galaxy Z Fold 6 5G MOBILE OFFER

దసరా, దీపావళి పండుగ సీజన్ ప్రారంభమైంది. దీంతో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు కస్టమర్లను ఆకర్షించడానికి తమ ప్రొడెక్టులపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ త్వరలో great indian festival sale 2025ను అందుబాటులోకి తీసుకురానుంది. సెప్టెంబర్ 23 నుంచి ఇది ప్రారంభం అవుతుంది. ఒకరోజు ముందు అంటే సెప్టెంబర్ 22న ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ పొందిన వారికి యాక్సిస్ లభిస్తుంది. 

ఈ నేపథ్యంలో అమెజాన్ ఒక ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌పై బంపర్ తగ్గింపు అందిస్తోంది. Samsung Galaxy Z Fold 6 5Gపై ఎవరి ఊహకు అందని డిస్కౌంట్ ప్రకటించింది. దీనిపై దాదాపు రూ.40వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ధర, ఫీచర్లు, ఇతర వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

Samsung Galaxy Z Fold 6 5G Offers

Samsung Galaxy Z Fold 6 5G మొబైల్ రూ.1,64,999కి లాంచ్ అయింది. ఇప్పుడు అమెజాన్‌లో రూ.1,24,999కి లభిస్తుంది. అంటే దాదాపు రూ.40,000 తగ్గింపు లభిస్తుందన్నమాట. అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే 5% వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్‌తో Samsung Galaxy Z Fold 6 5G ధర మరింత తగ్గుతుంది. అలాగే నెలకు రూ.10,417 నుండి ప్రారంభమయ్యే EMI ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

అంతేకాకుండా అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ అవకాశాన్ని కూడా అందిస్తుంది. కస్టమర్లు తమ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.42,350 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇంత పెద్ద మొత్తంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే.. ఫోన్ కండీషన్, మోడల్ మంచి స్థితిలో ఉండాలి. 

Samsung Galaxy Z Fold 6 5G Specs

Samsung Galaxy Z Fold 6 5G ఫోన్ డ్యూయల్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌లో బయట 6.3-అంగుళాల AMOLED ప్యానెల్, లోపల 7.6-అంగుళాల ప్రధాన స్క్రీన్ ఉన్నాయి. రెండు స్క్రీన్లు 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తాయి. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 12GB వరకు RAM, 512GB స్టోరేజ్‌తో వస్తుంది.

Samsung Galaxy Z Fold 6 5G  ఫోన్ 4,400mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది లాంగ్ బ్యాకప్‌ను అందిస్తుంది. కెమెరా విషయానికొస్తే.. దీనికి 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా వైడ్ లెన్స్, 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 10MP, 4MP ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంది. అందువల్ల ఎప్పటి నుంచో ఒక మంచి ఫోల్డబుల్ ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి అమెజాన్ నుండి ఈ ఆఫర్ మంచి ఛాన్స్.

Advertisment
తాజా కథనాలు