Amazon Prime Membership: అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్‌తో వచ్చే బెనిఫిట్స్ ఏంటో మీకు తెలుసా?

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నవారికి 24 గంటలు ముందుగానే ఆఫర్లు అన్ని ఓపెన్ అవుతాయి. అలాగే ఉచితంగా, తొందరగా డెలీవరీ చేస్తారు. అలాగే క్రెడిట్ కార్డు ద్వారా 5శాతం కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు.

New Update
Amazon Prime Membership

Amazon Prime Membership

అమెజాన్ గ్రేట్ ఫెస్టివల్ సీజన్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నవారికి 24 గంటలు ముందుగానే ఆఫర్లు అన్ని ఓపెన్ అవుతాయి. ఈ అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ అందరికీ ఉండదు. కొందరికి మాత్రమే ఉంటుంది. అసలు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉండటం వల్ల బెనిఫిట్స్ ఏంటో మరి ఈ స్టోరీలో చూద్దాం.  

ఇది కూడా చూడండి: Redmi 15R 5G : వర్త్ వర్మ వర్త్.. 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో కొత్త ఫోన్ అదిరింది..!

ఈజీ డెలివరీ

అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మినిమం ఆర్డర్ వేల్యూ లేకుండా ఉచిత డెలివరీ అందిస్తారు. అయితే కస్టమర్లు వారి స్థానాన్ని బట్టి ఒకటి లేదా రెండు రోజులు డెలివరీ డేట్స్‌ను ఎంచుకోవచ్చు. అలాగే అదే రోజు ఆర్డర్ డెలివరీ కావాలనుకుంటే ప్రైమ్ షాపింగ్ ఎడిషన్‌ను ఎంచుకోవచ్చు. ఈజీగా, ఉచితంగా డెలివరీ చేస్తారు. 

క్యాష్ బ్యాక్

అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ అందరూ అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోళ్లపై 5% క్యాష్‌ బ్యాక్ అందుకోవచ్చు. డిజిటల్ లేదా గిఫ్ట్ కార్డ్‌‌లు కూడా కొనుగోలు చేసి 2% తిరిగి పొందవచ్చు. 

అమెజాన్ ప్రైమ్ వీడియో

యూజర్లు వారి అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌లో భాగంగా వీడియోలు చూడవచ్చు. రెండు టెలివిజన్‌‌లతో పాటు మొత్తం ఐదు డివైజ్‌లు, టీవీ షోలు, ప్రైమ్ ఒరిజినల్ సిరీస్, స్పోర్ట్స్, ఇతర కంటెంట్‌‌లను కూడా ఇస్తుంది. అదే ప్రైమ్ లైట్ మెంబర్ షిప్‌ ఉన్నవారు అయితే యూజర్లు ప్రకటనలతో కూడిన అదే కంటెంట్‌ని HD రిజల్యూషన్‌లో ఒక స్క్రీన్‌ పై చూడవచ్చు.

ప్రైమ్ రీడింగ్

పుస్తక ప్రియులు ప్రైమ్ రీడింగ్‌ ను కూడా బోనస్‌ గా పొందవచ్చు. అయితే ఇది పూర్తి స్థాయి ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీరు ఈబుక్స్, మ్యాగజైన్స్, కామిక్ పుస్తకాలు, ఇతర మెటీరియల్స్ కూడా పొందుతారు. 

అమెజాన్ మ్యూజిక్

ప్రైమ్ మెంబర్స్ యాడ్స్ లేకుండా పాటలు వినవచ్చు. వీటిలో ప్లే లిస్ట్‌లు, ఆల్బమ్స్, స్టేషన్స్ కూడా ఉన్నాయి. ఎక్కువగా ఎవరైతే మ్యూజిక్ ఇష్టపడతారో వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 

ప్రైమ్ గేమింగ్

నెలవారీ ఉచిత గేమ్స్, ప్రత్యేకమైన ఇన్-గేమ్ కంటెంట్, మరిన్నింటికి యాక్సెస్ కోసం ఎలాంటి ఎక్స్‌ట్రా ఖర్చు కూడా ఉండదు. ఇది మల్టీ ప్లాట్ ఫామ్‌లలో వాడే వారికి బాగా ఉపయోగపడుతుంది. 

ప్రత్యేకమైన డీల్స్

లైటనింగ్ డీల్స్ కు ముందుగానే యాక్సెస్ పొందుతారు. అలాగే వీరికి ప్రత్యేకమైన డీల్స్ అందుతాయి. ముఖ్యంగా సెలవు రోజులు, స్పెషల్ సేల్ ఈవెంట్స్‌లో కొన్ని వస్తువులపై తగ్గింపు ఉంటుంది. 

ప్రైమ్ అడ్వాంటేజ్

ప్రైమ్ అడ్వాంటేజ్ అనేది చాలా మందికి అంతగా తెలియదు. కానీ ఇది అన్ని ప్రైమ్ ప్లాన్‌‌ల్లో ఉంది. కస్టమర్స్ స్మార్ట్‌ ఫోన్‌, ఇతర అర్హత ఉన్న వస్తువు పై నో-కాస్ట్ EMI పొందవచ్చు. అలాగే 6 నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ (Acko ద్వారా) పొందడం ద్వారా అధిక ప్రయోజనాలు పొందవచ్చు.

 అమెజాన్ ఫ్యామిలీ ఆఫర్స్

ప్రైమ్ సభ్యులకు అమెజాన్ ఫ్యామిలీ కూడా అందుబాటులో ఉంది. ఇందులో పిల్లలతో ఉన్న కుటుంబాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డీల్స్, బేబీ ప్రొడక్ట్స్, బొమ్మలు వంటి మరిన్ని ఆఫర్లు ఉన్నాయి.

ఇది కూడా చూడండి: Smart Phone: 13MP రియర్ కెమెరాతో రూ.7 వేల లోపే అదిరిపోయే ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Advertisment
తాజా కథనాలు