/rtv/media/media_files/2025/12/09/australia-2025-12-09-13-39-59.jpg)
అరచేతిలో ప్రపంచం.. విశ్వంలో ఎక్కడో ఉన్న వ్యక్తుల్ని, ఏదో మూలన జరిగిన సంఘటలను క్షణాల్లో మీ ముందుకు తీసుకువచ్చే వేదికే సోషల్ మీడియా. ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి కూడా పరిమితులు విధించాలని కొన్ని దేశాలు భావిస్తున్నాయి. అందులో ఆస్ట్రేలియా(Laws in australia n social media) ఓ అడుగు ముందేసి ప్రత్యేక చట్టం కూడా తీసుకువచ్చింది. 16ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంల వాడకాన్ని నిషేదిస్తూ(social media ban for minors) బిల్లు తయారు చేసింది. అదే ఆన్‌లైన్ సేఫ్ట్వీ అమైండ్‌మెంట్ బిల్లు 2024. ఈ చట్టం డిసెంబర్ 10 నుంచి ఈ దేశంలో అమలు కాబోతుంది. ప్రపంచంలో మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ చేసిన మొదటిసారి దేశంగా ఆస్ట్రేలియా నిలవబోతుంది. ఈ ఆన్‌లైన్ సేఫ్ట్వీ అమైండ్‌మెంట్ బిల్లు 2024 గురించి డిటైల్‌గా తెలుసుకుందాం..
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ నార్మన్ అల్బనీస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 16ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని తేల్చి చెప్పారు. సోషల్ మీడియా కారణంగా వ్యక్తిగతంగా నష్టపోయిన పిల్లల తల్లిదండ్రులు కోరుకున్న మార్పు ఇది. ఆ బాధ మరే తల్లిదండ్రులు అనుభవించకూడదనే ఉద్దేశంతో వాళ్లు ఈ చట్టం రావాలని కోరుకున్నారని అల్బనీస్ అన్నారు. దీని ప్రకారం.. 16 ఏళ్ల లోపు పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్, స్నాప్‌చాట్, ఫేస్‌బుక్, థ్రెడ్స్, ఎక్స్ వంటి ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లలో అకౌంట్‌లు ఉండకూడదు. ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ సైట్లకు మాత్రం అనుమతి ఉంటుంది. టెక్ కంపెనీలు ఈ నిబంధనను పాటించకపోతే భారీ జరిమానాలు 49.5 మిలియన్ డాలర్లు జరిమానా.. అంటే మన కరెన్సీలో రూ.4,500 కోట్ల దాకా జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
Also Read : నో యాక్టివ్ సిమ్.. నో వాట్సాప్.. అసలేంటీ కొత్త రూల్..?
ప్రధాన ఉద్దేశం..
పిల్లలు సోషల్ మీడియాకు బానిస అవ్వకుండా, వారిని ఆన్‌లైన్ వేధింపులకు దూరంగా ఉంచడం, ప్రైవసీకి భంగం కలగకుండా పిల్లలను రక్షించడమే దీని ఉద్దేశం. తెలిసి తెలియని వయసులో పిల్లలు సోషల్ మీడియాలో వైలెన్స్, న్యూడిటీ వైపు అట్రాక్ట్ అయి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అంతే కాదు సోషల్ మీడియా పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని పలు అధ్యాయనాల్లో తేలింది. అలాంటి యాప్స్‌కు వారిని దూరంగా ఉంచితే ఆందోళన, నిరాశ, నిద్రలేమి సమస్యలను తగ్గించవచ్చు. చిన్న వయసులోనే పిల్లల వ్యక్తిగత డేటా సోషల్ మీడియా సంస్థల చేతిలోకి వెళ్లకుండా నిరోధించవచ్చు.
డెన్మార్క్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ వంటి దేశాలు ఇప్పటికే మైనర్లు సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆస్ట్రేలియా తీసుకువచ్చిన చట్టాన్ని గమనిస్తున్నాయి. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఆస్ట్రేలియా ఆన్‌లైన్ సేఫ్ట్వీ బిల్లుకు మద్దతు కూడా ప్రకటించారు.
ఏం చేస్తారంటే..
సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు(No Social Media) యూజర్ల వయసు నిర్థారించడానికి మల్టీ లెవల్ వెరిఫికేషన్ రూల్స్ పెట్టనున్నాయి. పుట్టిన తేదీ, ఫేషియల్ స్కాన్ టెక్నాలజీ, డేటా క్రాస్-రిఫరెన్స్ కూడా చేయనున్నాయి. లొకేషన్, IP అడ్రెస్‌ను ఎప్పటికప్పుడు ట్రేస్ చేయనున్నారు. 16ఏళ్లకు లోపు వయసు కలిసిన యూజర్ల అకౌంట్లు డిసెంబర్ 4న నుంచే మెటా కంపెనీ హోల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్ అకౌంట్లు క్రియేట్ చేసేటప్పుడు గతంలో వారు ఇచ్చిన ఏజ్ 16ఏళ్ల కంటే తక్కువగా ఉంటే డిఫాల్ట్‌గా ఆ ఖాతాలు ఫ్రీజ్ అవుతాయి. అయితే ప్రస్తుతం వారి వయసు 16 సంవత్సరాలు దాటి ఉంటే.. ప్రభుత్వ గుర్తింపు కార్డుతో మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు.
డిసెంబర్ 10 తర్వాత ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్, స్నాప్‌చాట్, ఫేస్‌బుక్, థ్రెడ్స్, ఎక్స్ ఫ్లాట్‌ఫామ్‌లో అకౌంట్లు క్రియేట్ చేయాలంటే ఆస్ట్రేలియా దేశం(Australia Online Safety Amendment Bill)లో ప్రభుత్వం కల్పించిన గుర్తింపు కార్డుని అప్‌లోడ్ చేయాలి. అలాగే ఆయా ఫ్లాట్‌ఫామ్‌లు సెల్ఫీ వీడియోలో యూజర్లు ఏజ్ నిర్ధాయించుకోవడం జరుగుతుంది. స్నాప్‌చాట్ యూజర్లు ఏజ్ వెరిఫై కోసం బ్యాంక్ ఖాతాలు, ఫోటో ఐడి లేదా సెల్ఫీలను ఉపయోగించవచ్చని తెలిపింది. అంతే కాదు ఆయా యాప్‌ల్లో అకౌంట్లు క్రియేట్ చేయాలంటే యూజర్లు సెల్ప్ వెరిఫికేషన్ లేదా తల్లిదండ్రులు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటర్‌నెట్ ప్రొవైడర్ అడ్రెస్ గుర్తించకుండా.. VPI వాడకంపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. సోషల్ మీడియా కంపెనీలు VPN వినియోగాన్ని అడ్డుకోవడానికి టెక్నాలజీ యూస్ చేయనున్నాయి.
Also Read : దిమ్మతిరిగే బంపర్ డీల్.. iPhone 17 భారీ తగ్గింపు - డోంట్ మిస్!
ఉన్నా పాటించని రూల్స్..
1.దాదాపు అన్ని ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అకౌంట్ క్రియేట్ చేయాలంటే కచ్చితంగా 13ఏళ్ల పైబడి ఉండాలి. అమెరికాలోని 'పిల్లల ఆన్‌లైన్ గోప్యతా రక్షణ చట్టం' COPPA ఆధారంగా ఈ 13 ఏళ్ల వయో పరిమితిని అంతర్జాతీయంగా అనేక సంస్థలు పాటిస్తున్నాయి. 13 ఏళ్ల లోపు పిల్లల నుంచి పర్సనల్ డేటా సేకరించడాన్ని ఈ చట్టం నియంత్రిస్తుంది.
2. ఇన్‌స్ట్రాగ్రామ్, టిక్‌టాక్ వంటి కొన్ని ప్లాట్‌ఫామ్‌లు 16 లేదా 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారులకు వారి ఖాతాలను డిఫాల్ట్‌గా ప్రైవేట్‌గా ఉంచుతాయి. అంటే, వారి పోస్టులు లేదా వివరాలు కేవలం వారి ఫాలోవర్స్‌కు మాత్రమే కనిపిస్తుంది. అలాగే మైనర్లకు తెలియని వ్యక్తులు డైరెక్ట్ మెసేజ్‌లు పంపకుండా కంట్రోల్ ఉంటుంది.
3.కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు పిల్లల అకౌంట్లు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పర్యవేక్షించడానికి పేరెట్స్ కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల స్క్రీన్ సమయం, చాటింగ్ వివరాలు, మైనర్లు ఫాల్లో చేస్తున్న ఖాతాలు ఎప్పటికప్పుడు పేరెట్స్‌కు తెలుస్తోంది. తల్లిదండ్రుల అకౌంట్‌ను కంట్రోట్ చేయవచ్చు.
4. ఏజ్ ఆధారంగా అనేక సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు కొన్ని రకాల కంటెంట్‌లకు మైనర్లను దూరంగా ఉంచుతాయి. మద్యం, పొగాకు, హింస, లేదా అడల్ట్ కంటెంట్‌ను 18 ఏళ్ల లోపు మైనర్లకు దూరంగా ఉంచుతుంది. మైనర్లు టార్గెట్‌గా చేసుకొని తీసిన యాడ్స్‌ను కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లు నిషేధిస్తాయి.
Follow Us