/rtv/media/media_files/2025/04/17/oaSRe2bqeHadMJJwm5ZH.jpg)
jio airtel vi ready for recharge plan rates hikes by december 2025
అయిపోయింది.. అంతా అయిపోయింది. మొబైల్ యూజర్లకు మరో బిగ్ షాక్ త్వరలో తగలబోతుంది. వేరే వారితో ఫోన్ మాట్లాడాలన్నా, మెసేజ్ చేయాలన్నా, డేటా యూజ్ చేయాలన్నా ఇకపై మరింత ఖర్చు చేయాల్సిన సమయం ఆసన్నమవుతున్నట్లు తెలుస్తోంది. అవును మీరు విన్నది నిజమే. గత ఏడాది ప్రముఖ భారత టెలికాం సంస్థలు తమ మొబైల్ టారిఫ్స్ భారీగా పెంచిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా రిలయన్స్ జియో తమ రీఛార్జ్ ధరలను పెంచిన తర్వాత ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు తమ యూజర్లకు గట్టి షాక్ ఇచ్చాయి. జియో బాటలోనే తాము నడుస్తామని.. రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచేశాయి. అప్పట్లో ఈ విషయం పై పెద్ద దుమారమే రేగింది. అయితే మరోసారి ఈ కంపెనీలు తమ రీఛార్జ్ ధరలను పెంచబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: రీ-రిలీజ్ తో కూడా పరువు పోగొట్టుకున్న మాస్ కా దాస్
భారీగా పెంపు
ఈ ఏడాది తమ టారిఫ్స్ పెంచేందుకు టెలికాం సంస్థలు సిద్ధంగా ఉన్నాయనే వార్త యూజర్లను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 2025 ఏడాది చివరి నాటికి దాదాపు 10 నుంచి 20 శాతం మధ్య పెంచబోతున్నట్లు సమాచారం. ఇది గడిచిన 6ఏళ్లలో నాలుగో అతిపెద్ద రేట్ల పెంపుగా ఉండనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే ప్రజెంట్ వరల్డ్ వైడ్‌గా టెలికాం టారిఫ్స్ భారతదేశంలోనే తక్కువగా ఉన్నాయని ఈ ఏడాది జనవరిలో వెల్లడైన విషయం తెలిసిందే.
ఇది కూడా చూడండి: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!
అందుతున్న సమాచారం ప్రకారం.. ఇకపై టెలికాం సంస్థలు ఎప్పటికప్పుడు టారిఫ్స్ పెంచే పరిస్థితులు కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రయాపడుతున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే.. నెలవారీ రీఛార్జ్ ప్యాక్స్ ధరలు సుమారు రూ.30 నుంచి 60 మధ్య పెరిగే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
ఇది కూడా చూడండి: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టర్..రాజస్థాన్ కు మరో ఓటమి
Telecom Tariff Hikes | Tariff Hikes | latest-telugu-news | telugu-news | jio | airtel | vodafone-idea