iPhone 15పై అరాచకమైన ఆఫర్ భయ్యా.. ఏకంగా రూ.15 వేల డిస్కౌంట్!

ఐఫోన్ కొనుక్కోవాలని చూసే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.69,900 ఉండగా.. ఇప్పుడు రూ.57,999లకే లిస్ట్ అయింది. అలాగే బ్యాంక్ ఆఫర్‌తో మరింత తక్కువకే కొనుక్కోవచ్చు.

New Update
iphone 15

ఐఫోన్ అంటే అందరికీ ఇష్టమే. కానీ కొనాలంటేనే చాలా కష్టం. ఎందుకంటే దాని రేటు అంత ఉంటుంది మరి. పది ఇరవై వేలల్లో కాదు.. ఏకంగా అరవై వేలకు పైగా దాని ధర ఉంటుంది. అందువల్లనే ఐఫోన్ వాడాలనుకునే వారి కల కలగానే మిగిలిపోతుంది.

ALSO READ: అంబటి రాంబాబుపై చర్యలు.. టీడీపీ సంచలన ట్వీట్!

అయితే ఇప్పుడా ఆవసరం లేదు. ఎందుకంటే అతి తక్కువ ధరకే ఐఫోన్‌ను కొనుక్కోవచ్చు. దాదాపు రూ.12వేల తగ్గింపుతో ఐఫోన్ 15ను సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇటీవల దివాళీ సేల్ అందుబాటులోకి వచ్చింది.

Also Read :  క్షమాపణ చెప్పాకే రావాలి.. రాహుల్: KTR

ఐఫోన్ 15పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌

ఈ సేల్‌లో ఐఫోన్ 15పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ అందించింది. దీని అసలు ధర రూ.69,900 ఉండగా.. సేల్ సమయంలో రూ.50 వేలకు అందించింది. అయితే దివాళీ పండుగ పూర్తి అయిన తర్వాత కూడా ఐఫోన్ 15 ఆఫర్‌తో అందుబాటులో ఉంది.

Also Read :  అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

అయితే సేల్ సమయంలో లభించే ధర కంటే కాస్త ఎక్కువగా ఉంది. కానీ మిగతా ఆన్‌లైన్ ప్లాట్ ఫార్మ్‌ల కంటే తక్కువనే చెప్పాలి. దీని అసలు ధర రూ.69,900 కాగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.57,999లకి లభిస్తుంది. అంటే దాదాపు రూ.11,901 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. అదే సమయంలో ఈ ఫోన్‌పై మరిన్ని ఆఫర్లు ఉన్నాయి.

Also Read :  హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. VD12 షూటింగ్ లో అలా..!

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సక్షన్‌పై రూ.1500 తగ్గింపు, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు నో కాస్ట్ ఈఎంఐ ట్రాన్సక్షన్‌పై రూ.3000 తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. ఈ బ్యాంక్ తగ్గింపులతో మరింత తక్కువకే కొనుక్కోవచ్చు. దీంతో పాటు భారీ ఎక్స్ఛేంజ్ తగ్గింపు ఉంది. దాదాపు రూ.32,950 తగ్గింపు లభిస్తుంది. ఇక బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో మరింత తక్కువకే ఐఫోన్ 15ను కొనుక్కోవచ్చు.

Advertisment
తాజా కథనాలు