Stock Markets: అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 91 పాయింట్లు తగ్గి 78,722 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 3 పాయింట్లు పెరిగి 23,999 వద్ద కొనసాగుతోంది.

New Update
Stock Market: ఎలక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్.. ఇన్వెస్టర్ల సంపద 21 లక్షల కోట్లు ఢమాల్!

అమెరికా అధ్యక్ష ఎన్నికల‍ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్‌పై పడుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 23,950తో ప్రారంభం కాగా.. సెన్సెక్స్‌ 260 పాయింట్ల వద్ద పడిపోయింది. ఆ తర్వాత సెన్సెక్స్ 91 పాయింట్లు తగ్గి 78,722 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 3 పాయింట్లు పెరిగి 23,999 వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. ఈరోజు డాలర్‌తో రూపాయి విలువ 84.13 వద్ద ఉంది. 

ఇది కూడా చూడండి: ఎండతో నడిచే కారు.. ఒకసారి ఛార్జింగ్‌తో 1600KM..

లాభాల్లో ఈ షేర్లు..

ఈ రోజు సెన్సెక్స్‌లో అదానీ పోర్ట్స్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, ఇండ్‌స్ ఇండ్, టెక్ మహీంద్రా షేర్లు ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతున్నాయి. 

ఇది కూడా చూడండి:  Jio IPO: త్వరలో రాబోతున్న జియో ఐపీఓ.. ఎప్పుడంటే?

ఇదిలా ఉండగా.. మార్కెట్లోకి జియో ఐపీఓ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. దేశంలో టెలికాం వినియోగదారుల సంఖ్య ఎక్కువగా ఉన్న రిలయన్స్ జియో తన మొదటి ఐపీఓ వచ్చే ఏడాది జరగనున్నట్లు తెలుస్తోంది. జియో తర్వాతే రిలయన్స్ రిటైల్ ఐపీఓ జరుగతుందని సమాచారం. మార్కెట్‌లోకి రూ.8.40లక్షల కోట్ల విలువతో అడుగుపెట్టేందుకు జియో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. సర్వేలు ఏం చెబుతున్నాయంటే?

జియో ఐపీఓ కోసం రిలయన్స్ అధికారికంగా ఎలాంటి తేదీలను ప్రకటించలేదు. అయితే గతంలో 2019లో ఒకసారి రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ ఐదేళ్లలో పబ్లిక్‌కు వెళ్లాలని భావిస్తున్నామని, వాటిని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖేష్ అంబానీ తెలిపారు. కానీ ఇప్పటి వరకు మళ్లీ దాని గురించి ఎలాంటి ప్రకటన చేయాలేదు.

ఇది కూడా చూడండి:  Rangareddy District: బాలుడి ప్రాణం తీసిన స్కూల్ గేట్..

Advertisment
Advertisment
తాజా కథనాలు