/rtv/media/media_files/2025/04/22/8MLy0IWUmwC4FqjjuAQ5.jpg)
Stock Market Today
Stock Market Today: బుధవారం దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా మొదలై.. నత్తనడక నడుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు ఇక్కడ మార్కెట్లపైన ప్రభావం చూపిస్తున్నాయి. సెన్సెక్స్(Sensex) 190 పాయింట్లు తగ్గి 83,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ(Nifty)లో ఎటువంటి మార్పు లేకుండా 25,520 పైన ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 20 పైసలు పెరిగి 85.90 వద్ద ప్రారంభమైంది. వాణిజ్య సుంకాల్లో(Trade Tariff) అమెరికా అధ్యక్షుడు తగ్గకపోవడం.. ఆగస్టు 1 నుంచి కొత్త టారీఫ్ లను అమలు చేస్తానన్నారు. ఈ డెడ్ లైన్ ఇక పెంచరని కూడా స్పష్టం చేశారు. దీనికి తోడు కాపర్ దిగుమతులపై 50 శాతం సుంకం విధిస్తానని ప్రకటించడం మార్కెట్లపై ప్రభావం చూపించింది. ఫార్మా ఉత్పత్తులపై కూడా 200శాతం సుంకాలు విధిస్తామని చెప్పడం కూడా మన మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవడానికి కారణం అయింది.
రాగి, ఫార్మా సుంకాల ఎఫెక్ట్..
సెన్సెక్స్ లో 30 స్టాక్స్‌లో 17 నష్టపోగా.. 13 లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, హెచ్‌సిఎల్ టెక్ మరియు ఎల్ అండ్ టి దాదాపు 1% నష్టపోయాయి. ఆసియన్, హెచ్‌యుఎల్ , పెయింట్స్ 1.4% పెరిగాయి. ఇక నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 26 స్టాక్‌లు లాభపడగా, 24 స్టాక్‌లు నష్టపోయాయి. NSEలోని ఐటీ, రియాలిటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్‌లు పడిపోయాయి. ఆటో, FMCG, మీడియా ఫార్మా స్టాక్‌లు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు జూలై 8న అమెరికా డౌ జోన్స్ 0.37% తగ్గి 44,241 వద్ద ముగిసింది. అదే సమయంలో, నాస్‌డాక్ కాంపోజిట్ 0.029% పెరిగి 20,418 వద్ద, ఎస్ అండ్ పి 500 0.072% తగ్గి 6,226 వద్ద ముగిశాయి. ఇక ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 0.057% పెరిగి 39,712 దగ్గరా, కొరియా కోస్పి 0.48% పెరిగి 3,130 వద్ద ట్రేడవుతున్నాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.74% తగ్గి 23,970 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.29% పెరిగి 3,508 వద్ద ముగిసింది.