Fake QR Code Scam: ఎంతకు తెగించార్రా.. నకిలీ QR కోడ్ స్కామ్..పెట్రోల్ బంకులే టార్గెట్ !

ఈ స్కామ్ లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వినియోగదారులను మోసం చేసి, డబ్బును పంపు యజమానులకు బదులుగా మోసగాళ్ల ఖాతాల్లోకి మళ్లించిన ఈ హై-టెక్ మోసాన్ని పోలీసులు ఛేదించారు.

New Update
scam

ఐదు రాష్ట్రాల్లో పెట్రోల్ పంపు(petrol bunk)ల వద్ద నకిలీ QR కోడ్ స్కామ్(Fake QR Code Scam) ను ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని బాగ్‌పత్‌లో పోలీసులు బయటపెట్టారు. ఈ స్కామ్ లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వినియోగదారులను మోసం చేసి, డబ్బును పంపు యజమానులకు బదులుగా మోసగాళ్ల ఖాతాల్లోకి మళ్లించిన ఈ హై-టెక్ మోసాన్ని పోలీసులు ఛేదించారు. ఈ మోసానికి పాల్పడిన నిందితులు గతంలో ఫాస్ట్-ఫుడ్ వ్యాపారులుగా ఉన్నారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఈ నేరాలకు అలవాటు పడ్డారు.  వీరు వివిధ రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకులను లక్ష్యంగా చేసుకుని, అక్కడ ఉన్న అసలు QR కోడ్ స్టిక్కర్‌లను తీసివేసి, వాటి స్థానంలో తమ వ్యక్తిగత ఖాతాలకు లింక్ చేయబడిన నకిలీ QR కోడ్ స్టిక్కర్‌లను అతికించేవారు.

Also Read :  పండుగ పూట విషాదం.. ముగ్గురు యువకులు సజీవదహనం

లక్షల రూపాయలు స్వాహా

పెట్రోల్ నింపుకున్న వినియోగదారులు UPI ద్వారా చెల్లింపులు చేసినప్పుడు, ఆ డబ్బు నేరుగా మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిపోయేది. నిందితులు QR కోడ్‌లను మారుస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి, ఇది దర్యాప్తులో కీలకంగా మారింది.ఈ విధంగా వారు లక్షల రూపాయలు స్వాహా చేశారు. సెప్టెంబర్ 23న బాగ్ పత్‌లోని దోగట్ వద్ద ఉన్న రానా ఫిల్లింగ్ స్టేషన్ యజమాని సాధారణ అకౌంట్ల తనిఖీలో డబ్బు జమ కానట్లు గుర్తించడంతో ఈ మోసం బయటపడింది. పట్టుబడినవారు పంజాబ్‌లోని భటిండాకు చెందిన రింకు కుమార్, ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌కు చెందిన విపిన్గా గుర్తించారు. నిందితుల నుంచి నకిలీ స్కానింగ్ పరికరాలను (ఫేక్ స్కానింగ్ డివైజెస్) స్వాధీనం చేసుకున్నారు.ఇటువంటి మోసాలకు గురి కాకుండా ఉండాలంటే, QR కోడ్ ద్వారా చెల్లింపు చేసిన తర్వాత, డబ్బు నిజంగా పంపు యజమాని పేరిట జమ అయిందో లేదో మెసేజ్ (SMS) లేదా చెల్లింపు యాప్‌లో చూసుకోవడం మంచిది. 

Also Read :  ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్న బిడ్డని అడవిలో పడేసిన టీచర్

Advertisment
తాజా కథనాలు