/rtv/media/media_files/2025/10/02/farming-business-woman-2025-10-02-17-30-17.jpg)
Farming Business Woman
ఉద్యోగం కంటే వ్యాపారంలో కోట్లు సంపాదించవచ్చని నిరూపించింది ఓ 25 ఏళ్ల యువతి. ఉద్యోగం మానేసి వ్యవసాయం చేస్తూ ఓ యువతి కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో పూర్తి వివరాల్లో ఈ స్టోరీలో చూద్దాం.
పూణేకు చెందిన ఓ యువతి..
మహారాష్ట్రలోని పూణేకు చెందిన ప్రణీత వామన్ ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం చేసింది. కానీ తనకి ఎలాంటి సంతృప్తి లేదని తనకు ఉన్న పొలంలోనే వ్యవసాయం చేయాలనుకుంది. తన తండ్రి సాయంతో తనకు ఉన్న కొద్ది పొలంలోనే క్యాప్సికం సాగును వేసింది. పాలిహౌస్ పద్ధతిలో పంటలను పండించడంలో ట్రైనింగ్ తీసుకుంది. తక్కువ పెట్టుబడితో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి వాడింది. అలాగే ప్రభుత్వం కూడా 50 శాతం సబ్సిడీతో ఆర్థిక సాయం చేయడంతో తన వ్యాపారానికి ప్లస్ అయ్యింది. ప్రణీత ఇలా నాలుగు నెలలు కష్టపడటంతో తనకు 40 టన్నుల క్యాప్సికం దిగుబడి వచ్చింది. వీటిని ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో అమ్మకాలు పెట్టింది. కేవలం గ్రీన్ కలర్‌లో ఉండే క్యాప్సికంలు మాత్రమే కాకుండా పసుపు, ఎరుపు రంగులో ఉన్న వాటిని కూడా పండించింది.
ఇది కూడా చూడండి: VerSe Innovation: లాభాలతో దూసుకుపోతున్న వెర్సే ఇన్నోవేషన్.. రూ.2 వేల కోట్లకు పెరిగిన ఆదాయం!
వీటికి మార్కెట్‌లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఇలా ఆమె మొదటి ఏడాదిలోనే రూ.32 లక్షల టర్నోవర్ సాధించింది. ఆ తర్వాత ఇతరుల భూములను కూడా లీజుకు తీసుకుని పండించింది. ఇలా ప్రణీత వ్యాపారం ఇప్పుడు 4 కోట్ల టర్నోవర్ దాటింది. ఇందులో ఖర్చులు అన్ని తీసేస్తే.. ఆమెకు రూ.2.25 కోట్ల రూపాయలు మిగిలాయి. కొన్నేళ్లలోనే ఆమె కోట్లు సంపాదించింది. తెలివిగా వర్మీ కంపోస్టు, బయో ఫెర్టిలైజర్లను కలిపి ఆమె పంటలను పండిస్తోంది. ఈమె తన పంటలను డైరెక్ట్ హోల్‌సేల్ వ్యాపారుల ద్వారా అమ్ముతోంది. దీంతో ఆమెకు ముందుగానే ఆర్డర్లు వస్తుంటాయి. అలాగే ఆమె క్యాప్సికం సాగుకు పాలీహౌస్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. మీరు కూడా ఇలానే వ్యాపారం చేస్తే బాగా సంపాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Roshni Nadar: దేశంలోనే అత్యంత సంపన్న మహిళ ఈమెనే.. ఆస్తి ఎంతో తెలుసా?