/rtv/media/media_files/2025/08/28/ganesha-chavithi-2025-2025-08-28-13-48-11.jpg)
Ganesha Chavithi 2025
దేశవ్యాప్తంగా వినాయక చవితి(vinayaka chavithi 2025) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్ని అందించాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) సర్వే ప్రకారం.. ఈ ఏడాది గణేశోత్సవాల సందర్భంగా రూ.28,000 కోట్లకు పైగా వ్యాపారం జరగవచ్చని అంచనా వేసింది. వ్యాపారులు ఈసారి విదేశీ ఉత్పత్తులను పూర్తిగా పక్కన పెట్టి.. స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వినియోగదారులను కూడా స్వదేశీ ఉత్పత్తులు వాడేందుకు ప్రోత్సహిస్తున్నారు. వినాయక చవితి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాల్లో భారీ ఆర్థిక కార్యకలాపాలకు దారితీస్తోంది. వీటి గురించి మరికొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
కోటల్లో వ్యాపారులు..
ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా వినాయక మండపాలు ఏర్పాటయ్యాయి. ఒక్కో మండపంపై కనీస వ్యయం రూ.50,000 (సెటప్, అలంకరణ, సౌండ్ సిస్టమ్, విగ్రహాలు, పూలు మొదలైనవి) అనుకుంటే.. కేవలం మండపాలపైనే రూ.10,500 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. వినాయక విగ్రహాల వ్యాపారం రూ.600 కోట్లకు పైగా ఉంది. పూజా సామాగ్రి, ముఖ్యంగా పూలు, కొబ్బరికాయలు, పండ్లు, అగర్‌బత్తి వంటి వాటి వ్యాపారం రూ.500 కోట్లకు పైగా జరుగుతోంది. మోదకాలు, లడ్డూలు, ఇతర మిఠాయిల వ్యాపారం రూ.2,000 కోట్లను దాటనుంది. క్యాటరింగ్ టర్నోవర్ సుమారు రూ.3,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. పండుగకు సంబంధించిన దుస్తులు, అలంకరణ వస్తువులు వంటి రిటైల్ అమ్మకాలు రూ.3,000 కోట్లు కావచ్చు.
ఇది కూడా చదవండి: వినాయకుడి విగ్రహ ప్రతిష్టకు సరైన సమయం ఏంటో తెలుసా..?
గణపతి మండపాలు ఆధునిక రూపం సంతరించుకోవడంతో.. ఈవెంట్ మేనేజ్‌మెంట్ సేవలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ రంగం ద్వారా సుమారు రూ.5,000 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఈ ఉత్సవాల సందర్భంగా ఆభరణాల వ్యాపారం సుమారు రూ.1000 కోట్లు కానుంది. గణేశ్ మండపాలకు భీమా చేయించుకోవడం కూడా పెరిగింది. దీని ద్వారా భీమా కంపెనీలకు రూ.1,000 కోట్లకు పైగా వ్యాపారం లభిస్తుందని అంచనా. మొత్తంమీద వినాయక చవితి పండుగ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: మీ ఇంట్లో గణపతిని పెడుతున్నారా? అయితే.. ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి!