/rtv/media/media_files/2025/07/24/epfo-services-2025-07-24-06-46-48.jpg)
EPFO services
ఉద్యోగులకు EPFO సేవలు మరింత సులభతరం కానున్నాయి. EPF బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, పాక్‌బుక్ డౌన్‌లోడ్ చేయడం లాంటి సేవలు ఈజీగా పొందవచ్చు. డిజిలాకర్ అనే యాప్‌లో ఈపీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ సాయంతో ఈపీఎఫ్ ఖాతాదారులు ఎక్కడినుంచైనా కూడా పీఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్, ఇతర డాక్యుమెంట్లను యాక్సెస్ చేయొచ్చని EPFO ఎక్స్‌లో పోస్ట్ చేసింది. స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు డిజిలాకర్ యాప్ డౌన్‌లోడ్ చేసి PF అకౌంట్ బ్యాలెన్స్, పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Also Read: షాకింగ్ వీడియో.. యువతిని ఉతికారేశాడు - కడుపులో తన్ని, జుట్టు పట్టుకుని ఈడ్చేసిన యువకుడు!
ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. IOS యూజర్లకు త్వరలోనే ఈ సేవలు రానున్నాయి. మరో విషయం ఏంటంటే పీఎఫ్‌కు సంబంధించిన సేవలు ఉమాంగ్ యాప్‌తో పాటు PFO పోర్టల్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. ఒకవేల మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 99660 44425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. వివరాలు తెలుసుకోవచ్చు. మెసేజ్ రూపంలో UANతో లింక్ అయిన మొబైల్ నుంచి 77382 99899 నంబర్‌కు EPFOHO ‘UAN’ అని మెసేజ్ చేసినా కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.