No GST: మధ్యతరగతి ప్రజలకు అదిరిపోయే న్యూస్.. వీటిపై ఇక నో జీఎస్టీ?

ప్రస్తుతం ఉన్న 12 శాతం పన్ను శ్లాబును పూర్తిగా తొలగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ శ్లాబును 5 శాతం శ్లాబులోకి మార్చాలని కేంద్రం చూస్తోంది. అయితే దీనివల్ల ప్రభుత్వానికి సుమారుగా రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్లు నష్టం వస్తుందట.

New Update
ind

GST

ప్రస్తుతం ఉన్న జీఎస్టీ మధ్య తరగతి ప్రజలకు శాపంగా మారింది. ప్రతీ వస్తువుకి దాని ఛార్జీతో పాటు జీఎస్టీ కూడా ఉండటంతో మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు జీఎస్టీ విషయంలో శుభవార్త తెలిపింది. ప్రస్తుతం ఉన్న 12 శాతం పన్ను శ్లాబును పూర్తిగా తొలగించాలని భావిస్తోంది. ఈ శ్లాబును 5 శాతం శ్లాబులోకి మార్చాలని కేంద్రం చూస్తోంది. అయితే దీనివల్ల ప్రభుత్వానికి సుమారుగా రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్లు నష్టం వస్తుందని భావిస్తోంది. అయితే ధరలు తగ్గడం వల్ల వీటి వినియోగం పెరుగుతుందని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇది కూడా చూడండి:Missing girl : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్‌ వైపు వెళ్లి.....

ఇది కూడా చూడండి:మహారాష్ట్రలో దారుణం.. నడి రోడ్డులో 17ఏళ్ల బాలికపై లైంగికదాడి!

ఈ వస్తువులు అన్ని తక్కువ 

ఈ 12 శాతం శ్లాబును పూర్తిగా తొలగిస్తే  టూత్‌ పేస్ట్, కుక్కర్లు, గీజర్లు, సైకిళ్లు, రూ.1000 కంటే ఎక్కువ ఖరీదు ఉండే రెడీమేడ్ దుస్తులు, రూ.500-1000 మధ్య ధర ఉండే పాదరక్షలు వంటి అనేక వస్తువుల ధరలు తగ్గుతాయి. అయితే దీనికి పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ నెలాఖరులో 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. వీటికి సంబంధించిన నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుంది. 

ఇది కూడా చూడండి:Kannappa Box Office Collections: మంచు విష్ణుకు బిగ్ షాక్.. 'కన్నప్ప' కలెక్షన్ల డౌన్..ప్రభాస్ కూడా ఆదుకోలేడా!

Advertisment
Advertisment
తాజా కథనాలు