2024 ఏడాది మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రిలీజ్ అయిన బెస్ట్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఏడాదిలో ఐఫోన్ 16 సిరీస్, శాసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్, గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ అత్యధిక ప్రీమియం స్మార్ట్‌ఫోన్లుగా నిలిచాయి. ఇవి వాటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో మొబైల్ ప్రియుల్ని విపరీంగా ఆకట్టుకున్నాయి. ALSO READ: నేడు విద్యాసంస్థలకు సెలవు iPhone 16 Series ప్రముఖ అమెరికన్ తయారీ సంస్థ ఆపిల్ గ్లోబల్ మార్కెట్‌లో ఐఫోన్ 16 సిరీస్‌ను ఈ ఏడాది లాంచ్ చేసింది. భారత్ సహ ఇతర ప్రపంచ మార్కెట్‌లోకి ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఇది ఐఫోన్ 15 కంటే మరింత భారీ ఛేంజెస్‌తో వచ్చింది. ఐఫోన్ 16 సిరీస్ 4 మోడళ్లలో వచ్చింది. అవి ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్. ఐఫోన్ 16 ధరలు 128 జీబీ వేరియంట్ ధర రూ.79,900గా ఉంది. 256 జీబీ వేరియంట్ ధర రూ.89,900గా ఉంది. 512జీబీ వేరియంట్ ధర రూ.1,09,900గా కంపెనీ నిర్ణయించింది. ఐఫోన్ 16 ప్లస్ ధరలు ALSO READ: రేవంత్ రెడ్డి గలీజ్‌గా బిహేవ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు! 128 జీబీ వేరియంట్ ధర రూ.89,900.256 జీబీ వేరియంట్ ధర రూ.99,900.512జీబీ వేరియంట్ ధర రూ.1,19,900. ఐఫోన్ 16 ప్రో ధరలు 128 జీబీ వేరియంట్ ధర రూ.1,19,900.256 జీబీ వేరియంట్ ధర రూ.1,29,900.512జీబీ వేరియంట్ ధర రూ. 1,49,900.1TB జీబీ వేరియంట్ ధర రూ.1,69,900. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధరలు 256 జీబీ వేరియంట్ ధర రూ.1,44,900.512జీబీ వేరియంట్ ధర రూ. 1,64,900.1TB జీబీ వేరియంట్ ధర రూ. 1,84,900లుగా కంపెనీ నిర్ణయించింది. వీటిలో లేటెస్ట్ ఎ18 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. అంతేకాకుండా సెకండ్‌జనరేషన్ 3ఎన్ఎమ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది ఎ18 చిప్ 6 కోర్ సీపీయూతో వచ్చింది. ఈ సిరీస్ పవర్ ఫుల్ కెమెరాను కలిగి ఉంది. ఏకంగా 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో వచ్చింది. Samsung Galaxy S24 series శాంసంగ్ ఈ ఏడాదిలో లాంచ్ అయింది. ఇది కూడా పలు మోడళ్లను పరిచయం చేసింది. అందులో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 అల్ట్రా వంటివి ఉన్నాయి. ఇందులో Snapdragon 8 Gen 3 చిప్‌సెట్‌ను కంపెనీ అందించింది. ఇవి కూడా నాలుగు వేరియంట్లలో లభించింది. 128జీబీ, 256జీబీ, 512 జీబీ, 1TBజీబీ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ALSO READ: పాకిస్తాన్‌లో పుట్టి భారత ప్రధానిగా ఎదిగి... ఈ ఫోన్‌లో ఏఐ ఫీచర్లు అందించారు. ఇవి ఫోటో ఎడిటింగ్, లైవ్ ట్రాన్స్‌లేటింగ్ కాల్‌లు, నోట్‌లను క్లుప్తీకరించడం సమా మరిన్నింటికి సహాయపడతాయి. వీటి ప్రారంభ ధర రూ.62,999 నుంచి ప్రారంభం అవుతాయి. ఇక కెమెరా కూడా అదిరిపోయే లెన్స్‌లతో వచ్చాయి. ఇందులో 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 10 ఎంపీ అలాగే 12 ఎంపీ కెమెరాను అందించారు. Google Pixel 9 Series Google Pixel 9 మొబైల్ 13 ఆగస్ట్ 2024న ప్రారంభించబడింది. ఈ ఫోన్ 60 Hz రిఫ్రెష్ రేట్ 6.30-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వచ్చింది. Google Pixel 9 Android 14ని నడుపుతుంది. 4700mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. Google Pixel 9 వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 48-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉన్న డ్యూయల్ కెమెరా సెటప్‌ను ప్యాక్ చేస్తుంది. వెనుక కెమెరా సెటప్‌లో ఆటో ఫోకస్ ఉంది. ఇది సెల్ఫీల కోసం సింగిల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో 10.5-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. ఇది పియోనీ, పింగాణీ, అబ్సిడియన్, వింటర్‌గ్రీన్ కలర్‌లలో ప్రారంభించబడింది. దుమ్ము - నీటి రక్షణ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది Google Pixel 9, Pixel 9 Pro, Pixel 9 Pro XL, Pixel 9 Pro fold మోడళ్లలో వచ్చింది. Google Pixel 9 12/ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.79,999గా ఉంది. అలాగే 16/256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.1,09,999గా నిర్ణయించబడింది. ALSO READ: విశిష్ట వ్యక్తిని కోల్పోయాం..ప్రధానితో సహా ప్రముఖుల సంతాపం Google Pixel 9 Pro 16/256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 1,09,999. Pixel 9 Pro XL 16/256జీబీ వేరియంట్ ధర రూ.1,24,999.16/512జీబీ వేరియంట్ ధర రూ.1,39,999గా కంపెనీ నిర్ణయించింది. Pixel 9 Pro fold 16/256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,72,999గా ఉంది.