మాజీ ప్రధాని మన్మోహన్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే అన్ని విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా వారం రోజులపాటు సంతాప దినాలుగా నిర్వహించాలని సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులిచ్చారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది.
ALSO READ: విశిష్ట వ్యక్తిని కోల్పోయాం..ప్రధానితో సహా ప్రముఖుల సంతాపం
7 రోజుల పాటు సంతాప దినాలు
ALSO READ: నేడు విద్యాసంస్థలకు సెలవు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు వారి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఆయన మృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ మండలి సమావేశం జరగనుంది. ఈ భేటీలో మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేయనున్నారు.
10 ఏళ్లపాటు ప్రధానిగా
ALSO READ: రేవంత్ రెడ్డి గలీజ్‌గా బిహేవ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు!
1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహరావు సర్కార్ లో ఆర్థిక మంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్.. దేశ ఆర్థిక సంస్కరణల్లో ముఖ్యపాత్ర పోషించారు. ఆర్థిక వ్యవస్థ పై చెరగని ముద్ర వేశారు. 2004 నుంచి 2014 వరకు సుమారు పది సంవత్సరాల పాటు భారత ప్రధానిగా దేశానికి సేవలందించిన మన్మోహన్ సింగ్.. సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు.
ప్రధాని మోదీ సంతాపం
ALSO READ: పాకిస్తాన్‌లో పుట్టి భారత ప్రధానిగా ఎదిగి...
మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. దేశం ఒక విశిష్ట వ్యక్తిని కోల్పోయింది అని ప్రధాని మోదీ అన్నారు. అలాగే మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ‘‘ఎంతో నిరాడంబరంగా ఉండే ఆయన ఆర్థికవేత్తగా ఎదిగారు. దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్రవేశారు. పార్లమెంట్‌లో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవి. ప్రధానిగా దేశ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ఎంతో కృషి చేశారు’’ అని ప్రధాని మోదీ మన్మోహన్‌ను గొప్పతనాన్ని తలుచుకున్నారు.