Hyderabad: అమెజాన్‌కు భారీ నష్టం.. మోసం చేసిన ఉద్యోగులు

అమెజాన్ సంస్థకు ఉద్యోగులు భారీ టోకరా వేశారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఉద్యోగులు నకిలీ ట్రిప్పులను డెలివరీ చేసినట్లు చూపించి.. భారీ మొత్తంలో కమిషన్ తీసుకున్నారు. ఇలా సంస్థకు దాదాపుగా రూ.102 కోట్లు నష్టం వాటిల్లడంతో సైబర్ క్రైంకు ఫిర్యాదు చేసింది.

New Update
Amazon Prime Day Sale: 'అమెజాన్ ప్రైమ్ డే' సేల్ ముసుగులో సైబర్ నేరగాళ్ల మోసాలు..

Amazon

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌కు సొంత ఉద్యోగులే పెద్ద టోకరా వేశారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఉద్యోగులు భారీ మోసానికి పాల్పడ్డారు. నకిలీ ట్రిప్పులను డెలివరీ చేసినట్లు చూపించి.. కమిషన్ తీసుకున్నారు. ఇలా నకిలీ ట్రిప్పుల ద్వారా సంస్థకు దాదాపుగా రూ.102 కోట్లు నష్టం వాటిల్లింది. ఈ విషయం గుర్తించిన అమెజాన్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేసింది. గతంలో కంపెనీలో పనిచేసిన ఉద్యోగులే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: America: కాళ్లూ, చేతులు కట్టేసి.. నీళ్లు కూడా ఇవ్వకుండా.. అక్రమవలసదారుపై అమెరికా వికృత చేష్టలు!

ట్రిప్‌లు ఛార్జీలు తీసుకుంటూ కోట్లలో..

ఈ కామర్స్ అమెజాన్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కస్టమర్లకు డెలివరీ విషయంలో సాంకేతికను హైదరాబాద్ నుంచే నిర్వహిస్తారు. అమెజాన్‌లో ఐటమ్స్ కొనుగోలు చేసిన తర్వాత దగ్గరలో ఉన్న షిప్పింగ్ సెంటర్‌కు పంపుతారు. ఇక్కడి నుంచి డెలివరీ ప్రాంతానికి వెళ్తాయి. డెలివరీ చేయడానికి ఐటమ్స్ తీసకుని చెక్ ఇన్ చేస్తారు. ఆర్డర్ వినియోగదారుడికి ఇచ్చిన తర్వాత చెక్ అవుట్ చేస్తారు. దీనికి జీపీఎస్ ట్రాక్ ఉంటుంది. 

ఇది కూడా చూడండి: occult worship : కర్నూలు జిల్లా బి తాండ్రపాడు ఎస్సార్ విద్యాసంస్థల్లో  క్షుద్ర పూజల కలకలం

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న కాల్ సెంటర్‌తో ప్రపంచ వ్యాప్తంగా కూడా కార్యకలాపాలు నిర్వహిస్తారు. అయితే అమెరికాలో డెలివరీ చేయాలంటే ఎక్కువ కిలోమీటర్ల వెళ్లాలి. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఆర్డర్లు చేసేవారు. డెలివరీకి వెళ్లకుండానే వెళ్లినట్లు ట్రిప్‌లు నమోదు చేసి, వినియోగదారులు లేరని చెప్పేవారు. ఇలా డెలివరీ చేయడానికి వెళ్లినప్పుడు వారు లేకపోతే తీసుకెళ్లినందుకు దూరాన్ని బట్టి డెలివరీ ఖర్చును అమెజాన్ ఇస్తుంది. గత కొంత కాలం నుంచి ట్రిప్‌లకు వెళ్లడం, వినియోగదారులు లేరని వాటి కమిషన్‌ను తీసుకోవడం వంటి మోసానికి పాల్పడ్డారు. 

ఇది కూడా చూడండి: Vitamin D Injection: ఏడాదికి ఒకసారి విటమిన్ డి ఇంజెక్షన్‌తో లాభాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు